సింగపూర్ ఓపెన్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు
సింగపూర్ ఓపెన్‌లో భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. స్టార్ ప్లేయర్ పీవీ సింధు, శ్రీకాంత, హెచ్ఎస్ ప్రణయ్ సహా మిగతా సభ్యులు టోర్నీ నుంచి నిష్క్రమించారు. బీడబ్య్లూఎఫ్ వరల్డ్ సిరీస్ సూపర్-750 పురుషుల సింగిల్స్ ఫ్రి క్వార్టర్స్ లో శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. చై హావ్ లీ (చైనీస్ తైపీ) చేతిలో 15-21, 19-21తో శ్రీకాంత్ ఓడిపోయాడు. 37నిమిషాల పాటు సాగిన ఈ పోరులో శ్రీకాంత్ ఆకట్టుకోలేకపోయాడు. మరో మ్యాచులో యువ షట్లర్ ప్రియాన్సు రజాతవ్ 17-21, 16-21తో మూడో సీడ్ కొడాయి నరొకా చేతిలో పరాజయం పాలయ్యాడు.
పురుషుల డబుల్స్ ఓడిన అర్జున్-ధ్రువ్
పురుషుల డబుల్స్ బరిలో మిలిగిన భారత జంట అర్జున్, ధ్రువ్ కపిల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ జోడీ బెన్, సీన్ చేతిలో అర్జున్, ధ్రువ్ కపిల్ 15-21, 19-21తో ఓడిపోయారు. దీంతో ఈ టోర్నీలో భారత్ పోరు పూర్తిగా ముగిసింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన పీవీ.సింధు కూడా ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. ఈ టోర్నీలో భారత షట్లర్లు రాణిస్తారని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. సింగపూర్ ఓపెన్ లో భారత షట్లర్లు ఎవరూ రాణించకపోవడం గమానర్హం.