LOADING...
T20 WC 2026: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్-సౌతాఫ్రికా వార్మప్‌ మ్యాచ్.. తేదీ ఇదే!
టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్-సౌతాఫ్రికా వార్మప్‌ మ్యాచ్.. తేదీ ఇదే!

T20 WC 2026: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్-సౌతాఫ్రికా వార్మప్‌ మ్యాచ్.. తేదీ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2026
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందు జరిగే వార్మప్‌ మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీకి ముందు మొత్తం 16 వార్మప్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వంలోని భారత జట్టు ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అంతకుముందు ఫిబ్రవరి 2న ఇండియా 'ఏ' జట్టు యూఎస్ఏతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరగనున్నాయి. అదే విధంగా ఫిబ్రవరి 6న నమీబియాతో ఇండియా 'ఏ' మధ్య జరిగే మ్యాచ్‌ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో నిర్వహించనున్నారు. భారత్‌-దక్షిణాఫ్రికా వార్మప్‌ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

Details

జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఇక అఫ్గానిస్థాన్ vs స్కాట్లాండ్‌, యూఎస్ఏ vs ఇండియా 'ఏ', కెనడా vs ఇటలీ, నేపాల్‌ vs యూఏఈ, అఫ్గానిస్థాన్‌ vs వెస్టిండీస్‌, పాకిస్థాన్‌ vs ఐర్లాండ్‌, నేపాల్‌ vs కెనడా, న్యూజిలాండ్‌ vs యూఎస్ఏ, ఇటలీ vs యూఏఈ, నమీబియా vs ఇండియా 'ఏ' వంటి వార్మప్‌ మ్యాచ్‌లు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్షంగా ప్రసారం కానున్నాయి. ఇదిలా ఉండగా శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న తిలక్‌ వర్మను మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం ఇండియా 'ఏ' జట్టులో ఎంపిక చేశారు. తిలక్‌ ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.

Details

వార్మప్‌ మ్యాచ్‌ల కోసం ఇండియా 'ఏ' జట్టు

ఆయుష్‌ బదోని (కెప్టెన్‌), నమన్‌ ధీర్‌, అశుతోష్‌ శర్మ‌, ప్రియాంశ్‌ ఆర్య‌, నారాయణన్‌ జగదీశన్‌ (వికెట్‌కీపర్‌), తిలక్‌ వర్మ‌, రియాన్‌ పరాగ్‌, మానవ్‌ సుతార్‌ అశోక్‌ శర్మ‌, ఉర్విల్‌ పటేల్‌ (వికెట్‌కీపర్‌), గుర్జప్‌నీత్‌ సింగ్‌, విప్రాజ్‌ నిగమ్‌, రవి బిష్ణోయ్‌, ఖలీల్‌ అహ్మద్‌, మయాంక్‌ యాదవ్‌.

Advertisement