Page Loader
ENG vs IND: భారత్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్
భారత్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

ENG vs IND: భారత్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో భారత జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టెస్టు సిరీస్‌తో 2025-27 డబ్ల్యుటీసీ (వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్) సైకిల్‌కు శుభారంభం కానుంది. ఇప్పటికే శుభమన్ గిల్ నాయకత్వంలో 18 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు. జూన్ 20న హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టు కూడా తమ జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఇంగ్లాండ్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే, పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్ గాయాల కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు.

వివరాలు 

తొలి టెస్టుకు ఇంగ్లాండ్ టీమ్‌

ఇంగ్లాండ్ టీమ్‌: బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఒవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్‌ టంగ్, క్రిస్ వోక్స్. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్, వికెట్‌ కీపర్‌), యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్‌ నాయర్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్, వాషింగ్టన్‌ సుందర్, శార్దూల్‌ ఠాకూర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్, అర్ష్‌దీప్‌ సింగ్, కుల్‌దీప్‌ యాదవ్‌.

వివరాలు 

సిరీస్‌ షెడ్యూల్‌ ఇదే.. 

తొలి టెస్ట్‌ - 2025 జూన్‌ 20 - 24, వేదిక: హెడింగ్లీ, లీడ్స్‌ రెండో టెస్ట్‌ - 2025 జులై 2 - 6, వేదిక: ఎడ్జ్‌బస్టన్, బర్మింగ్‌హామ్‌ మూడో టెస్ట్‌ - 2025 జులై 10 - 14, వేదిక: లార్డ్స్, లండన్‌ నాలుగో టెస్ట్‌ - 2025 జులై 23 - 27, వేదిక: ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్‌ ఐదో టెస్ట్‌ - 2025 జులై 31 - ఆగస్ట్ 4, వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్‌