World Cup final: టీమిండియా, ఆస్ట్రేలియా జట్లలో కీలక ఆటగాళ్ల గణాంకాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్‌లో ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది.
ఈ క్రమంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లలో కీలక ఆటగాళ్లు ఎవరు? ఇరు జట్ల మధ్య ఇదివరకు జరిగిన మ్యాచ్‌లలో ఎవరిది పై చేయి ఉంది. ఈ ప్రపంచ కప్‌లో కీలక ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందో ఓ సారి తెలుసుకుందాం.
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొత్తం 150 వన్డేలు జరిగాయి. ఇందులో భారత్ 57 విజయాలు సాధిస్తే, ఆస్ట్రేలియా 83 మ్యాచలలో గెలుపొందింది. దాదాపు 10మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా ఎనిమిది సార్లు విజయం సాధించింది. భారత్ ఐదింటిలో గెలుపొందింది.
ఫైనల్
విరాట్ కోహ్లీ X ఆడమ్ జంపా
విరాట్ కోహ్లీ ఈ ప్రపంచకప్‌లో 711పరుగులతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా తరఫున కోహ్లీని ఎక్కువ సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా ఆడమ్ జంపా ఉన్నాడు.
ఇద్దరు 13 ఇన్నింగ్స్‌లలో తలపడగా, ఐదుసార్లు కోహ్లీ వికెట్‌ను జంపా సాధించాడు. ప్రపంచకప్‌లో ఆడమ్ జంపా 22వికెట్లు పడగొట్టాడు.
రోహిత్ శర్మ X మిచెల్ స్టార్క్
ఈ ప్రపంచ కప్‌లో భారత్ విజయాల్లో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచ కప్‌లో 550 పరుగులతో అద్భుతంగా రాణించాడు.
టీమిండియాకు మంచి ఆరంభాన్నిస్తున్న రోహిత్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా స్టార్క్‌ను ప్రయోగించే అవకాశం ఉంది.
ఈ ఇద్దరు 12ఇన్నింగ్స్‌లలో తలపడగా, రోహత్‌ను స్టార్క్ మూడుసార్లు అవుట్ చేశాడు.
ఫైనల్
డేవిడ్ వార్నర్ X మహమ్మద్ షమీ
ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. డేవిడ్ వార్నర్‌కు వన్డేల్లో మహ్మద్ షమీ 10సార్లు బౌలింగ్ చేయగా.. మూడు సార్లు అవుట్ చేశాడు.
ట్రావిస్ హెడ్ X జస్ప్రీత్ బుమ్రా
ట్రావిస్ హెడ్.. ఆస్ట్రేలియా జట్టులో మరో కీలక బ్యాటర్. హెడ్‌ను అవుట్ చేసేందుకు హెడ్‌ను అవుట్ చేసేందుకు జస్ప్రీత్ బుమ్రాను రోహిత్ ప్రయోగించే అవకాశం ఉంది.
వన్డేల్లో హెడ్- బూమ్రా మూడు మ్యాచుల్లో తలపడ్డారు. ఈ క్రమంలో ఒకసారి హెడ్‌ను బుమ్రా అవుట్ చేశాడు.
మాక్స్‌వెల్ X కుల్దీప్
మిడిలార్డర్‌లో ఆస్ట్రేలియాకు గ్లెన్ మాక్స్‌వెల్ కీలక ఆటగాడు. ఈ ఇద్దరు వన్డేల్లో 11సార్లు తలపడ్డారు. అందులో మూడుసార్లు మాక్స్‌వెల్‌ను కుల్దీప్ అవుట్ చేశాడు.