IND Vs AUS : ఆస్ట్రేలియాతో రేపే టీ20 సిరీస్.. సమరానికి సిద్ధమైన భారత్
వన్డే వరల్డ్ కప్ (ODI World Cup) పోరు ముగిసింది. భారత్‌పై ఆస్ట్రేలియా గెలుపొంది విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు మళ్లీ కంగారులతో టీమిండియా (Team India) మరో సమరానికి సిద్ధమైంది. రేపటి నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. విశాఖ పట్నం వేదికగా రేపు ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో చాలామంది సీనియర్ ప్లేయర్లకు BCCI విశ్రాంతినిచ్చింది. యువ ప్లేయర్లు ఆసీస్ పై ఏ విధంగా రాణిస్తారో వేచి చూడాలి. ఇప్పటివరకూ ఇరు జట్లు 26 టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 15 మ్యాచుల్లో గెలవగా, ఆస్ట్రేలియా 10 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.
సూర్యకుమార్ యాదవ్ పై భారీ ఆశలు
ఆసీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్ వెల్ 75 ఇన్నింగ్స్‌ల్లో 41సార్లు స్పిన్నర్ల చేతిలో ఔటయ్యాడు. రవి బిష్ణోయ్ టీ20ల్లో ఒకసారి అతన్ని ఔట్ చేశాడు. బిష్టోణ్ బౌలింగ్‌లో మాక్స్ వెల్ ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగామారింది. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌లలో టిమ్ డేవిడ్ ఒకరు. డెత్ ఓవర్లలో అర్ష్ దీప్, టిమ్ డేవిడ్‌ను ఔట్ చేస్తే ఆసీస్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది టీ20ల్లో సంచలన ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఆసీస్ బౌలర్ ఆడప్ జంపాను సూర్యకుమార్ యాదవ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.