IND vs NZ:న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్.. టీమ్‌ఇండియాలో కీలక మార్పు?
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్ కోసం భారత జట్టు సిద్ధమైంది.
ఈ హోరాహోరీ పోరుకు సంబంధించి తుది జట్టు ఎలా ఉంటాయో అన్న విషయంపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఇప్పటికే చర్చిస్తున్నారు.
25 ఏళ్ల విరామం తర్వాత కివీస్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న నేపథ్యంలో జట్టు ఎంపిక కీలకంగా మారింది.
ఈ క్రమంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఒక కీలక మార్పుతో బరిలోకి దిగే అవకాశముందని సమాచారం.
Details
బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు లేవు
ఈ కీలక మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ మోకాలికి గాయం అయ్యిందన్న వార్తలు వచ్చినా అతడు ఫైనల్ మ్యాచ్‌లో ఆడతాడని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
దీంతో భారత ఇన్నింగ్స్‌ను శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మలు ప్రారంభించనున్నారు. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు.
ఆపై శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య తదుపరి బ్యాటింగ్ చేయనున్నారు.
అయితే, మరోసారి రిషభ్ పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.
Details
కుల్‌దీప్ బదులుగా వాషింగ్టన్ సుందర్?
స్పిన్ విభాగం ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకం కానుంది. భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్నా నలుగురికి తుది జట్టులో స్థానం దక్కే అవకాశముంది.
గత మ్యాచ్‌ల్లోనూ ఇదే ఫార్ములాను టీమ్‌ఇండియా అమలు చేసింది. ఇప్పుడు కూడా అదే వ్యూహంతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
అయితే, ఒక్క మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ లైనప్‌ను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో, కుడిచేతి వాటం స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోవాలన్న యోచనలో భారత్ ఉన్నట్లు సమాచారం.
దీంతో తుది జట్టులో కుల్‌దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
రెండు మ్యాచుల్లో కుల్‌దీప్ 17.3 ఓవర్లలో 100 పరుగులు ఇచ్చి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసాడు.
Details
స్పిన్ విభాగంలో బలం
ఈ నేపథ్యంలో, బ్యాటింగ్‌లోనూ మద్దతుగా నిలిచే వాషింగ్టన్ సుందర్‌ను తీసుకుంటే 9వ నంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ బలపడుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయాలని టీమిండియా యోచిస్తోంది.
ఇప్పటికే జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తితో కూడిన స్పిన్ విభాగం బలంగా ఉంది.
వీరికి తోడుగా వాషింగ్టన్ సుందర్ జట్టులో చేరితే, భారత్ మరింత సమతుల్యమైన కూర్పుతో బరిలోకి దిగనుందని సమాచారం.
అయితే తుది జట్టు పై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ సేన తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.