Page Loader
Ind Vs NZ: న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌.. కేన్‌ విలియమ్సన్‌ మూడో టెస్ట్‌కు దూరం
న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌.. కేన్‌ విలియమ్సన్‌ మూడో టెస్ట్‌కు దూరం

Ind Vs NZ: న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌.. కేన్‌ విలియమ్సన్‌ మూడో టెస్ట్‌కు దూరం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2024
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాతో జరగనున్న మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా న్యూజిలాండ్‌ జట్టు స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. గాయాల కారణంగానే విలియమ్సన్‌ తొలి రెండు టెస్ట్‌లలో కూడా పాల్గొనలేకపోయాడు.

వివరాలు 

ఇంగ్లండ్‌ సిరీస్‌ దృష్ట్యా ప్రత్యేక చర్యలు 

నవంబర్‌లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌ దృష్ట్యా, కివీస్‌ మేనేజ్‌మెంట్‌ విలియమ్సన్‌ను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం విలియమ్సన్‌ న్యూజిలాండ్‌లోనే రిహాబ్‌లో ఉన్నాడు. అతను మూడో టెస్ట్‌ కోసం భారత్‌కు రావడం లేదని కివీస్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. కాగా , మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టెస్ట్‌ ముంబై వేదికగా నవంబర్‌ 1న ప్రారంభం కానుంది.