Page Loader
SA vs IND: దక్షిణాఫ్రికాతో నేడే తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?
దక్షిణాఫ్రికాతో నేడే తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?

SA vs IND: దక్షిణాఫ్రికాతో నేడే తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ డర్బన్‌లో రాత్రి 8.30కు ఆరంభం అవుతుంది. టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపై ఢీకొనడం ఒక సవాలు. ప్రత్యేకంగా, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ,రవీంద్ర జడేజా లాంటి వాళ్లు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో,అనుభవం తక్కువైన యువ జట్టు ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టులో ఎక్కువ మంది ఐపీఎల్‌లో ప్రదర్శన చూపిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు తగిన అవకాశంగా మారవచ్చు, ఎందుకంటే దక్షిణాఫ్రికా పిచ్‌లపై విజయవంతంగా ఆడగలిగితే, వారు ప్రపంచంలో ఎక్కడైనా సవాళ్లను ఎదుర్కొనే సమర్థులవుతారు.

వివరాలు 

దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎదుర్కొవడం భారత బ్యాటర్లకు ఒక కఠినమైన పరీక్ష

అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ తదుపరి స్థానాల్లో ఉంటారు. కుర్రాళ్లు తడబడ్డ పరిస్థితుల్లో హార్దిక్, సూర్య వంటి సీనియర్లపై ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత ఉంటుంది. అర్ష్‌దీప్‌తో పాటు అవేష్, యశ్ దయాళ్‌ పేస్ బాధ్యతలను పంచుకుంటారు. అక్షర్ పటేల్, చక్రవర్తి స్పిన్ విభాగంలో రాణిస్తారు. దక్షిణాఫ్రికా జట్టులో మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్ వంటి సీనియర్లతో పాటు మహరాజ్‌, రీజా హెండ్రిక్స్, స్టబ్స్ వంటి అనుభవం గల ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో బార్ట్‌మన్, కొయెట్జీ, యాన్సెన్ వంటి యువ పేస్ బౌలర్లు ఉన్నారు, వీరిని ఎదుర్కొవడం భారత బ్యాటర్లకు ఒక కఠినమైన పరీక్ష.

వివరాలు 

తుది జట్లు (అంచనా): 

కేశవ్ మహరాజ్ ప్రమాదకర స్పిన్నర్ అన్న విషయం తెలిసిందే. డర్బన్‌లో పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది, కాబట్టి బంతికి బాగా బౌన్స్ ఉంటుంది. పేస్‌ బౌలింగ్‌ భారత జట్టుకు ఇక్కడ విజయావకాశాలను ఇచ్చే అవకాశం ఉంది. భారత్‌: అభిషేక్, శాంసన్, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్, రింకు, అక్షర్, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్, అవేష్‌ ఖాన్, యశ్‌ దయాళ్‌. దక్షిణాఫ్రికా: రీజా, రికిల్‌టన్, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), క్లాసెన్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్, కేశవ్, ఎంగబా పీటర్, బార్ట్‌మన్, కొయెట్జీ.