T20 world Cup: 2024 టీ20 ప్రపంచకప్ సౌతాఫ్రికా పై గెలిచిన టీమిండియా
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. టీమిండియా చరిత్రలో నాలుగోసారి ప్రపంచకప్ (ODI, T20) టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో 140 కోట్ల మంది భారతీయులకు సంబరాలు చేసుకునే సువర్ణావకాశం లభించింది. భారత జట్టు వన్డే ప్రపంచకప్‌ను రెండుసార్లు (1983, 2011) గెలిచిన విషయం తెలిసిందే. కాగా టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కూడా రెండుసార్లు (2007, 2024) గెలుచుకుంది. టీమిండియా జట్టు చివరిసారిగా 2011లో ప్రపంచకప్ (ODIలో) గెలిచింది. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ (టీ20లో) టైటిల్‌ను గెలుచుకున్నారు.
విరాట్ తొలి అర్ధశతకం
ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో భారత జట్టు 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ,అక్షర్ పటేల్‌తో కలిసి 72పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.ఆతర్వాత కోహ్లీ 48 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కి ఇదే తొలి అర్ధశతకం.కోహ్లి 59 బంతుల్లో మొత్తం 76 పరుగులు చేశాడు. అక్షర్ 31 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు.చివర్లో శివమ్ దూబే 16 బంతుల్లో 27 పరుగులు చేశాడు. మరోవైపు ఆఫ్రికా తరఫున స్పిన్నర్ కేశవ్ మహరాజ్,పేసర్ ఎన్రిక్ నార్సియా చెరో 2 వికెట్లు తీశారు. మార్కో జాన్సెన్ -1,కగిసో రబడా-1 వికెట్లు తీశారు.
టీ20 ప్రపంచకప్ తొలి సీజన్‌లో భారత జట్టు విజయం
భారత్, సౌతాఫ్రికా జట్లు ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఫైనల్స్‌కు చేరుకున్నాయి. భారత కెప్టెన్, క్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. దక్షిణాఫ్రికా జట్టు తొలిసారిగా ప్రపంచకప్ లో ఫైనల్‌కు చేరుకుంది. కాగా, 2007లో టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలి సీజన్‌లో భారత జట్టు విజయం సాధించింది. అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్.