IND vs ENG : మూడో వన్డేలో 142 పరుగులతో టీమిండియా గెలుపు..సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో భారత్ 142 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలుచుకుని ట్రోఫీని సొంతం చేసుకుంది.
టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 356 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 34.2 ఓవర్లలో 214 పరుగులకే కుప్పకూలింది.
ఫిలిప్(23), డకెట్(34), బాంటన్(38), రూట్(24) మాత్రమే కొంత పోరాటపటిమ కనబరిచారు, అయితే మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, అక్షర్, పాండ్య ఒక్కొక్కరు రెండు వికెట్లు తీశారు.
సుందర్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టి ఇంగ్లాండ్ జట్టును పరాజయానికి నెట్టారు.
వివరాలు
ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు
భారత జట్టు ముందుగా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది.
బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ (112; 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, శ్రేయస్ అయ్యర్ (78; 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విరాట్ కోహ్లీ (52; 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు.
కేఎల్ రాహుల్ (40; 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి పరుగులు సాధించాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశాడు.
సాకిబ్ మహ్మూద్, గుస్ అట్కిన్సన్, జో రూట్ తలా ఒక్క వికెట్ తీశారు.