LOADING...
Ashwin Retirement from IPL: ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న రవిచంద్రన్ అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ పోస్ట్..
రిటైర్మెంట్ ప్రకటిస్తూ పోస్ట్..

Ashwin Retirement from IPL: ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న రవిచంద్రన్ అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ పోస్ట్..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో నుండి వీడ్కోలు చెప్పిన అతడు, తాజాగా ఐపీఎల్‌ (IPL) ఫార్మాట్‌ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. గతంలో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ సమయంలోనే టెస్టుల నుండి రిటైర్మెంట్‌ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యంలో ఉంచిన అశ్విన్‌, ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) తరఫున నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అతను ఈ నిర్ణయం, ఇటీవల తనపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

 అశ్విన్‌ ఎక్స్‌ పోస్టు 

"ఇది ఒక ప్రత్యేకమైన రోజు.ప్రత్యేకమైన ఆరంభం.ప్రతి ముగింపు,కొత్త ప్రారంభానికి అవకాశాన్ని ఇస్తుంది.ఐపీఎల్‌లో నా ప్రయాణం ఈ రోజు ముగుస్తుంది. అయితే, ఇతర లీగ్‌లలో ఆట అన్వేషించే కొత్త అధ్యాయం ఈరోజు మొదలవుతుంది.ఐపీఎల్‌లో నాకు అద్భుతమైన జ్ఞాపకాలను అందించిన అన్ని ఫ్రాంచైజీలకు, బీసీసీఐకి కృతజ్ఞతలు. నా ముందున్న అవకాశాలను ఆస్వాదించి, సద్వినియోగం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాను" అని ఎక్స్‌లో అశ్విన్‌ పోస్టు చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎక్స్‌లో అశ్విన్‌ పోస్టు

వివరాలు 

అశ్విన్ కెరీర్ 

అశ్విన్‌ ఐపీఎల్‌లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌, పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, పుణె జట్లలో ప్రాతినిధ్యం వహించిన అతడు, టీమ్‌ఇండియా తరఫున 106 టెస్ట్ మ్యాచ్‌లలో 537 వికెట్లు సాధించాడు. అలాగే, బ్యాటింగ్‌లో 3503 పరుగులు చేసి, 6 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలను నమోదు చేశాడు. టెస్ట్‌లో అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 124. ఐపీఎల్‌ మాత్రమే కాదు, వన్డేల్లో 116 మ్యాచ్‌లలో 156 వికెట్లు, 65 T20 మ్యాచ్‌లలో 72 వికెట్లు తీసుకున్నట్టు అశ్విన్‌ గణాంకాలు చెబుతున్నాయి.