
ఆసియా క్రీడల్లో విజృంభిస్తున్న భారత అథ్లెట్లు.. రెండో రోజు 2 స్వర్ణాలు, ఆరు మెడల్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా గేమ్స్ లో రెండు రోజు భారత అథ్లెట్లు చక్కగా రాణిస్తున్నారు. తొలి రోజు ఐదు పతకాలతో సత్తా చాటిన అథ్లెట్లు, రెండో రోజు రెండు స్వర్ణాలు, ఆరు మెడల్స్ సాధించారు.
భారత మహిళల జట్టు పసిడి కైవసం చేసుకోగా, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ రుద్రాంక్ష, ప్రతాప్‌సింగ్, దివ్యాన్ష్‌సింగ్ ద్వయం బంగారు పతకాన్ని సాధించారు. ఇక ఫెన్సింగ్‌లో భవానిదేవీ ఓటమిపాలైంది.
క్వార్టర్ ఫైనల్‌లో భవానీ దేవి చైనాకు చెందిన షావో యాకీపై 7-15 తేడాతో ఓడిపోయింది.
మరోవైపు సిమ్మింగ్‌లో భారత అథ్లెట్లు ఫైనల్‌కు చేరారు. శ్రీహరి నటరాజ్, లికిత్ సెల్వరాజ్, సజన్ ప్రకాష్, తనీష్ మాథ్యూ హీట్స్‌లో 3:40.84 సెకన్లతో మొత్తం నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.
Details
భారత హాకీ జట్టు ఘన విజయం
ఆసియా గేమ్స్ లో భారత పురుషుల హకీ జట్టు సత్తా చాటింది. ప్రిలిమిటనీ రౌండ్ ఏ మ్యాచులో సింగపూపర్ పై 16-1 తేడాతో ఘన విజయం సాధించింది.
హర్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ తో సహా నాలుగు గోల్స్, మన్ దీప్ 3, వరుణ్ కుమార్, అభిషేక్ 2 చొప్పున గోల్స్ చేశారు. తర్వాతి మ్యాచులో జపాన్ తో భారత్ పోటీ పడనుంది.
మరోవైపు భారత మహిళల స్క్వాష్ టీమ్ సత్తా చాటింది. పూల్-బి మ్యాచులో పాకిస్థాన్ ను 3-0తో భారత్ ఓడించింది. ఇక భారత మహిళల జట్టు బుధవారం నేపాల్, మకావోతో తలపడనుంది.
వుషూ మహిళల 60 కేజీల విభాగంలో నోరెమ్ రోషిబిన దేవి సెమీస్ కు చేరారు.