Champions Trophy: వివాదానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముగింపు.. ఆ స్టేడియంలో భారత జెండా
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది.
అయితే, ఈ టోర్నీ ప్రారంభానికి ముందు కరాచీ స్టేడియంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
భారత జెండాను అక్కడ ప్రదర్శించకపోవడం పట్ల తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పందించి, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టి భారత జెండాను స్టేడియంలో ప్రదర్శించింది.
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాలు
జెండా లేకపోవడం - తీవ్ర విమర్శలు
ఇటీవల కరాచీ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించినప్పటికీ, భారత జెండా మాత్రం కనిపించలేదు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో పాక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీనిపై పీసీబీ స్పందిస్తూ, "భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. కాబట్టి కరాచీ స్టేడియంలో భారత జెండాను ఉంచలేదు. అలాగే, బంగ్లాదేశ్ ఇంకా పాకిస్థాన్‌కు రాలేదు, కాబట్టి వారి జెండా కూడా ఎగరలేదు" అని వివరణ ఇచ్చింది.
వివరాలు
PCB వెనుకడుగు - స్టేడియంలో భారత జెండా
అయితే, విమర్శలు పెరుగుతుండటంతో పీసీబీ ఈ వివాదానికి ముగింపు పలికే చర్యలు చేపట్టింది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కరాచీ స్టేడియంలో భారత జెండా స్పష్టంగా కనిపిస్తోంది.
అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే అన్నీ 8 జట్ల జాతీయ పతాకాలు స్టేడియంలో ప్రదర్శించబడ్డాయి.దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లు కనిపిస్తోంది.
భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లోనే
పాకిస్థాన్‌లో ఆడేందుకు టీమ్‌ఇండియా తిరస్కరించడంతో,ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారు.
భారత జట్టు తమ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.లీగ్ దశలో గెలిస్తే సెమీఫైనల్,ఫైనల్ మ్యాచ్‌లు కూడా అక్కడే జరుగుతాయి.
ఇక భారత్-పాక్ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.ఈ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్ ఈ నెల 23న దుబాయ్ వేదికగా జరగనుంది.