Page Loader
Asian Games-2023 : సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత్ పురుషుల హాకీ జట్టు
సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత్ పురుషుల హాకీ జట్టు

Asian Games-2023 : సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత్ పురుషుల హాకీ జట్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2023
06:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు విజయాలతో దూసుకెళ్తుతోంది. పుల్-ఎలో జరిగిన అన్ని లీగ్ మ్యాచులలో భారత్ భారీ గోల్స్ తేడాతో ఘన విజయాలను నమోదు చేసింది. ఇవాళ జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్‌ను 12-0తేడాతో భారత హాకీ జట్టు చిత్తు చేసింది. దీంతో పుల్-ఎ నుంచి టేబుల్ టాపర్ గా ఉన్న భారత హాకీ జట్టు సెమీ ఫైనల్ కి అర్హత సాధించింది. ఇక సెమీస్‌లో భారత్‌కు రజక పతకం ఖాయం కానుంది. ఫైనల్ లోనూ విజయం హాకీ జట్టు గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకొనుంది. ఈ టోర్నీలో భారత హకీ జట్టు వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

12-0  తేడాతో భారత్ ఘన విజయం