Loading...
FIFA: ప్రపంచకప్‌లో భారత మూలాల ఆటగాళ్ల సందడి
ప్రపంచకప్‌లో భారత మూలాల ఆటగాళ్ల సందడి

FIFA: ప్రపంచకప్‌లో భారత మూలాల ఆటగాళ్ల సందడి

వ్రాసిన వారు Moogati Shabari
Jun 04, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌లో భారత జట్టు పాల్గొనకపోయినా, ఈ మెగా టోర్నీపై భారత అభిమానుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గదు. ముఖ్యంగా అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి జట్లకు దేశంలో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ప్రతి ప్రపంచకప్‌ సందర్భంగా లక్షలాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే భారత జట్టు ప్రపంచకప్‌లో లేకపోవడం అభిమానులకు ఎప్పుడూ ఒక లోటుగా అనిపిస్తుంది. సమీప భవిష్యత్తులో కూడా భారత్‌కు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం కనిపించకపోవడం నిరాశ కలిగించే అంశమే.

వివరాలు

ఆ నలుగురిపైనే ఫోకస్..

అయితే ఈసారి ప్రపంచకప్‌లో భారత మూలాలు కలిగిన నలుగురు ఆటగాళ్లు వివిధ దేశాల తరఫున బరిలోకి దిగనున్నారు.

సర్‌ప్రీత్‌ సింగ్‌, శామ్యూల్‌ ముత్తుసామి, నిశాన్‌ వేలుపిళ్లై, తెహ్‌సిన్‌ మహ్మద్‌లు తమ ప్రతిభతో ప్రపంచ వేదికపై మెరవడానికి సిద్ధమయ్యారు.

గతంలో భారత మూలాలు కలిగిన ఫ్రెంచ్‌ మిడ్‌ఫీల్డర్‌ వికాశ్‌ దొరాసూ 2006 ప్రపంచకప్‌లో ఆడగా, ఇప్పుడు ఈ నలుగురు అతని బాటలో నడుస్తున్నారు.

వికాశ్‌ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందినవారు కావడం విశేషం.

వివరాలు

సర్‌ప్రీత్‌ సింగ్‌ (న్యూజిలాండ్‌)

సర్‌ప్రీత్‌ సింగ్‌ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో పంజాబీ కుటుంబంలో జన్మించాడు.

2018లో న్యూజిలాండ్‌ అండర్‌-23 అభివృద్ధి జట్టు సభ్యుడిగా ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌ కోసం భారత్‌కు వచ్చి, భారత జట్టుపై కూడా ఆడాడు.

అదే సంవత్సరంలో న్యూజిలాండ్‌ సీనియర్‌ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

తరువాత జర్మనీ అగ్రశ్రేణి ఫుట్‌బాల్‌ లీగ్‌లో ఆడిన తొలి భారత సంతతి ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

2019లో ప్రముఖ క్లబ్‌ బయెర్న్‌ మ్యూనిచ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ప్రస్తుతం 27 ఏళ్ల సర్‌ప్రీత్‌ న్యూజిలాండ్‌ జట్టు తరఫున 24 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

ADVERTISEMENT

వివరాలు

శామ్యూల్‌ ముత్తుసామి (డీఆర్‌ కాంగో)

శామ్యూల్‌ ముత్తుసామి ఫ్రాన్స్‌లో జన్మించాడు. ఆయన తల్లి కాంగోకు చెందినవారు కాగా, తండ్రి భారత తమిళ మూలాలు కలిగిన కుటుంబానికి చెందినవారు.

29 ఏళ్ల ముత్తుసామి ప్రస్తుతం గ్రీస్‌ సూపర్‌ లీగ్‌లోని అట్రొమిటోస్‌ క్లబ్‌కు ఆడుతున్నాడు.

2019లో డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన అతడు ఇప్పటివరకు 57 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.

మిడ్‌ఫీల్డర్‌గా ఆడే ముత్తుసామి, ఫ్రాన్స్‌లో ఎఫ్‌సీ నాంటెస్‌, టర్కియేలోని సివస్పోర్‌ క్లబ్‌ల తరఫున కూడా తన సేవలు అందించాడు.

ADVERTISEMENT

వివరాలు

నిశాన్‌ వేలుపిళ్లై (ఆస్ట్రేలియా)

నిశాన్‌ వేలుపిళ్లై ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జన్మించాడు. ఆయన తల్లి ఆంగ్లో-ఇండియన్‌ కాగా, తండ్రి మలేసియాకు చెందినవారు.

వారి కుటుంబ మూలాలు శ్రీలంక తమిళ సమాజానికి చెందుతాయి. 25 ఏళ్ల నిశాన్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా ఎ-లీగ్‌లో మెల్‌బోర్న్‌ విక్టరీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

2026 ప్రపంచకప్‌ అర్హత పోటీల సందర్భంగా 2024లో తొలిసారిగా ఆస్ట్రేలియా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు.

తన తొలి మ్యాచ్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా మైదానంలోకి దిగిన అతడు చైనాపై గోల్‌ నమోదు చేసి ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత ఆస్ట్రేలియా తరఫున మరో ఏడు మ్యాచ్‌లు ఆడాడు.

ఇప్పటివరకు చేసిన మూడు గోల్స్‌ కూడా ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో రావడం అతని ప్రత్యేకత.

వివరాలు

తెహ్‌సిన్‌ మహ్మద్‌ (ఖతార్‌)

తెహ్‌సిన్‌ మహ్మద్‌ 2006లో ఖతార్‌ రాజధాని దోహాలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌కు చెందిన మలయాళీ కుటుంబానికి చెందినవారు.

తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే ఫుట్‌ బాల్‌ వైపు ఆకర్షితుడయ్యాడు.

ఖతార్‌ స్టార్స్‌ లీగ్‌లో ఆడిన తొలి భారత సంతతి ఆటగాడిగా తెహ్‌సిన్‌ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.

ప్రస్తుతం అతడు అల్‌ దుహైల్‌ ఎస్‌సీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

2024లో ప్రపంచ కప్‌ అర్హత పోటీల సందర్భంగా ఖతార్‌ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

లెఫ్ట్‌ వింగర్‌గా ఆడే తెహ్‌సిన్‌ తన తొలి మ్యాచ్‌ను ఆఫ్గానిస్థాన్‌పై ఆడాడు.

ADVERTISEMENT