
Asian Games 2023: షూటింగ్‌లో భారత్ కు మరో గోల్డ్ మెడల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా క్రీడలు 2023లో భాగంగా ఆదివారం భారత్ మరో బంగారు పతకం సాధించింది.
ఈ మేరకు భారత షూటింగ్ త్రయం డారియస్ కినాన్ చెనాయ్, జోరావర్ సింగ్ సంధు, పృథ్వీరాజ్ తొండైమాన్ తో కూడిన భారత జట్టు షూటింగ్‌లో స్వర్ణం పతకం గెలిచింది.
ఈ నేపథ్యంలోనే ఈ ఆసియా క్రీడల్లో 7వ షూటింగ్ గోల్డ్ మెడల్ సాధించినట్టైంది.
మొత్తంగా ఆసియా గేమ్స్ షూటింగ్ విభాగంలో భారత్ 21వ పతకాన్ని ఒడిసిపట్టింది. ఇందులో 7 స్వర్ణం, 9 రజతం, మరో 5 కాంస్యం పతకాలు ఉండటం విశేషం.
చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో ఆదివారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటింగ్ త్రయం మరోసారి ఆధిపత్యం ప్రదర్శించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
షూటింగ్‌లో భారత్ కు మరో స్వర్ణ పతకం
Asian Games 2023: Indian Shooters Kynan Chenai, Zoravar Singh and Prithviraj Tondaiman clinch gold medal in Trap-50 Men's Team event pic.twitter.com/Rm8wntZbhA
— ANI (@ANI) October 1, 2023