వెస్టిండీస్ టూరుకు భారత జట్టు ప్రకటన.. తొలిసారిగా భారత జట్టులోకి యువ ప్లేయర్లు
త్వరలో ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా టెస్టు, వన్డే జట్లను నేడు ప్రకటించింది. టెస్టు, వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. మొదటిసారిగా భారత జట్టులోకి యువ ప్లేయర్లు ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్‌లో పరుగుల మోత మోగించిన యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌కు తొలిసారిగా భారత టెస్టు జట్టులో చోటు లభించింది. 2021 నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్ నవదీప్ సైనీకి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. ఇక వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజరాను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. టెస్టులకు వైస్ కెప్టెన్‌గా అంజిక్యా రహానే ఎంపికయ్యాడు. టెస్టు వికెట్ కీపర్‌గా తెలుగుతేజం కేఎస్ భరత్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు.
వన్డే, టెస్టులకు ఎంపికైన ప్లేయర్లు
టీమిండియా టెస్టు జట్టు రోహిత్‌శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, నవదీప్ సైనీ టీమిండియా వన్డే జట్టు రోహిత్‌శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేశ్ కుమార్