IND vs PAK: పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్ వీసా నిరాకరణ.. ఎందుకంటే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే పాక్‌లో ఈ టోర్నీ నిర్వహిస్తే బీసీసీఐ తమ జట్టును పంపమని ఐసీసీకి స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ పీసీబీకి కూడా తెలియజేసింది. హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించే దానిపై పాకిస్థాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాబోయే ఆసియా కప్, యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, దిల్లీ కప్ టోర్నమెంట్‌ల కోసం పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత హైకమిషన్ వీసాలు ఇవ్వడానికి నిరాకరించింది.
తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పీఎస్ఏ డైరెక్టర్
ఇందుకు సంబంధించి పాకిస్థాన్ స్క్రాబుల్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) డైరెక్టర్ తారిక్ పర్వేజ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతేడాది భారత్‌లో పోటీపడి విజయం సాధించిన ఆటగాళ్లతో సహా జట్టులోని సగం మందికి వివరణ లేకుండా వీసాలు నిరాకరించారని పేర్కొన్నారు. పాకిస్థాన్ గైర్హాజరు కావడం టోర్నమెంట్‌కు గట్టి ఎదురుదెబ్బ అని ఆయన వ్యాఖ్యానించారు.