
Asian Games 2023 : క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు.
గురువారం జరిగిన ఆసియా క్రీడల ఛాంపియన్ షిప్‌లో భారత మహిళ బ్యాడ్మింటన్ జట్టు ఘన విజయం సాధించింది.
మంగోలియాను 3-0తో ఓడించి భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన పివి.సింధు మొదటి సింగిల్స్‌లో మైగ్‌మార్ట్‌సెరెన్ గన్‌బాటర్‌పై 21-3 21-3 తేడాతో విజయం సాధించింది.
Details
దర్ఖన్ బాటర్ ను ఓడించిన అష్మితా చలిహా
దక్షిణాసియా గేమ్స్ లో మహిళల సింగిల్స్‌లో ఛాంపియన్ గా నిలిచిన అష్మితా చలిహా, దర్ఖన్‌బాటర్‌పై విజయం సాధించింది.
21-2 21-3 తేడాతో దర్ఖన్ బాటర్‌ను అష్మితా చలిహా ఓడించింది.
ఇక మూడోవ సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ ఖులాంగూ బాటర్‌పై 21-0 21-2 తేడాతో గెలుపొందింది.
క్వార్టర్ ఫైనల్‌కు చేరడం సంతోషంగా ఉందని, ఈసారి బలమైన జట్టు థాయ్ లాండ్ తో తలపడుతున్నామని, అందులో విజయం సాధించడానికి ఇప్పటికే ప్రణాళికలు తయారు చేశామని పివి.సింధు పేర్కొన్నారు.