
ENGW vs INDW: భారత్ శుభారంభం.. ఇంగ్లాండ్‌పై తొలి వన్డేలో విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు జోరు కొనసాగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌లోనూ విజయంతో ఆరంభించింది. బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. ఇందులో సోఫియా డంక్లీ 92 బంతుల్లో 9 ఫోర్లతో 83 పరుగులు చేయగా, అలైస్ రిచర్డ్స్ 53 పరుగులు చేసి ఆకట్టుకుంది. వీరి రాణింపు వల్లే ఆ జట్టు స్కోరు 250 మార్క్ దాటింది.
వివరాలు
దీప్తి శర్మ చివరి వరకు నిలిచి భారత్‌ను గెలిపించింది
బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లు రాణించారు.క్రాంతి గౌడ్ 10 ఓవర్లలో 55 పరుగులిచ్చి 2వికెట్లు పడగొట్టగా,స్నేహ్ రాణా 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటర్ల పరుగులను కట్టడి చేశారు. తెలుగు అమ్మాయి శ్రీచరణి 1 వికెట్ తీసింది.అనంతరంలక్ష్య ఛేదనకు దిగిన భారత్ 48.2ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. దీప్తి శర్మ (నాటౌట్ 62 పరుగులు; 64 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్)జెమీమా రోడ్రిగ్స్ (48 పరుగులు)ఐదో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నిర్మించి జట్టును విజయపథంలో నడిపించారు. జెమీమా అవుట్ అయిన తర్వాత కూడా దీప్తి శర్మ చివరి వరకు నిలిచి భారత్‌ను గెలిపించింది. అలాగే ప్రతీక రావల్ 36 పరుగులు చేయగా,స్మృతి మంధాన 28 పరుగులతో సహకరించారు.