Page Loader
2023 ఐపీఎల్‌లో సత్తా చాటే ఐదుగురు ఆల్ రౌండర్లు వీరే
మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం

2023 ఐపీఎల్‌లో సత్తా చాటే ఐదుగురు ఆల్ రౌండర్లు వీరే

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2023
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ టైటాన్స్ తరుపున హార్ధిక్ పాండ్యా బరిలోని దిగనున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్‌లలో ఒకడిగా నిలిచాడు. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ముందుండి నడిపించి పాండ్యా టైటిల్‌ను అందించాడు. పాండ్యా 44.27 సగటుతో 487 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు తీశాడు. మొత్తంమీద, అతను 107 ఐపిఎల్ మ్యాచ్‌లలో 1,963 పరుగులు చేసి, 50 వికెట్లను తీశాడు. చైన్నై సూపర్ కింగ్స్ 2023 వేలంలో బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ముఖ్యంగా అతను 2017లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు, పూణే సూపర్‌జెయింట్ తరపున 316 పరుగులు చేసి, 12 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో రెండు సెంచరీలు సాధించి అద్భుతమైన ఫామ్‌లో స్టోక్స్ ఉన్నాడు.

ఐపీఎల్

గ్రీన్‌ను రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై

ఆస్ట్రేలియా సంచలనం కామెరాన్ గ్రీన్ రూ. 2023 వేలంలో ముంబై ఇండియన్స్ 17.5 కోట్లకు కొనుగోలు చేసింది. 140 కిలోమిటర్ల వేగంతో బంతిని విసిరే సామర్థ్యం అతనికి ఉంది. గ్రీన్ ఇప్పటి వరకు 21 టీ20 మ్యాచ్‌లు ఆడి 245 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ టీ20 ఫార్మాట్‌లో ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. కేకేఆర్ తరుపున 91 మ్యాచ్‌లో 88 వికెట్లు పడగొట్టి 1,977 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. 210 మ్యాచ్‌ల్లో 2,502 పరుగులు చేసి 132 వికెట్లు పడగొట్టాడు. 2021లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో జడేజా 37 పరుగులు చేసిన విషయం తెలిసిందే.