IPL 2023 : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఆర్సీబీ ఆటగాళ్ల హవా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం డబుల్ హెడర్ తర్వాత పాయింట్ల టేబుల్, ఆరెంజ్, పర్పుల్ లీడర్లలో కీలక మార్పులు చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ పై 24 పరుగుల తేడాతో గెలుపొందిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకెళ్లింది. ఇక ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్టులో ఆర్సీబీ ఆటగాళ్లే నిలవడం విశేషం. ఆర్సీబీ ఆరు మ్యాచ్ ల్లో మూడు విజయాలను సాధించి ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఏడో స్థానానికి దిగజారగా.. ఈ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలోనే నిలిచింది.
343 పరుగులతో డుప్లెసిస్ అగ్రస్థానం
ఇక ఈ సీజన్ లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ నిలిచాడు. ఆరు మ్యాచ్ లో 343 పరుగులు చేసి పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. అటు విరాట్ కోహ్లీ 279 పరుగులతో మూడో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. పంజాబ్ కింగ్స్ తో నాలుగు వికెట్లు తీసిన ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్నారు. ఆరు మ్యాచ్ లో 12 వికెట్లు తీసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరోపక్క లక్నో బౌలర్ మార్క్ వుడ్, రాజస్థాన్ బౌలర్ చాహల్, గుజరాత్ బౌలర్ రషీద్ తలా 11 వికెట్లు తీసి సిరాజ్ తర్వాతి స్థానంలో నిలిచారు.