IPL 2023: లక్నోను ఢీకొట్టడానికి సన్ రైజర్స్ సిద్ధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అటల్ బిహారి వాజ్ పేయి క్రికెట్ స్టేడియంలో రేపు జరగనుంది. ఐపీఎల్‌లో లక్నో రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ 72 పరుగుల తేడాతో రాజస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. లక్నో ఆటగాడు కైల్ మేయర్ మొదటి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీ చేసి భీకర ఫామ్ లో ఉన్నాడు. పవర్ ప్లేలో అతను ప్రత్యర్థుల బౌలింగ్‌లో విరుచుపడే అవకాశం ఉంది. అయితే క్వింటాన్ డికాక్ రావడంతో మేయర్స్ వన్‌డౌన్‌లో దిగనున్నట్లు సమాచారం.
అరుదైన రికార్డుకు చేరువలో కృనాల్ పాండ్యా
ముఖ్యంగా కృనాల్ పాండ్యా ఐపీఎల్లో 1000 పరుగులకు చేరుకోవడానికి 8 పరుగుల దూరంలో ఉన్నారు. ఇక మార్క్ వుడ్ అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీపై (5/14) తో చెలరేగిన విషయం తెలిసిందే. డి కాక్ గత ఐపీఎల్ సీజన్‌లో 508 పరుగులు చేశాడు ఐపీఎల్‌లో భువనేశ్వర్ పవర్ ప్లేలో 57 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. గత సీజన్‌లో రాహుల్ త్రిపాఠి 158.23 స్ట్రైక్ రేట్ తో 400 పరుగులు చేశాడు. ఉమ్రాన్ మాలిక్ గత సీజన్‌లో 22 వికెట్లు తీసి నాలుగో స్థానంలో నిలిచారు. ఇక మార్క్రామ్ టీ20ల్లో 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగి అద్భుత ఫామ్ లో ఉన్నాడు.