Page Loader
IPL 2023 : పీయూష్ చావ్లా బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యా చెలరేగేనా..?
ఐపీఎల్ లో 21 వికెట్లు తీసిన చావ్లా

IPL 2023 : పీయూష్ చావ్లా బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యా చెలరేగేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2023
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 క్వాలిఫైయర్-2 మ్యాచులో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. మే26న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 : 30 గంటలకు ప్రారంభం కానుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్స్‌లో చైన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ముంబై స్పిన్నర్ పీయూష్ చావ్లా బౌలింగ్ లో హార్ధిక్ పాండ్యా ఎలా రాణిస్తాడో ప్రస్తుతం అసక్తికరంగా మారింది. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ చావ్లా ఐపీఎల్ లో హార్ధిక్ పాండ్యాను ఒకసారి ఔట్ చేశాడు. అదే విధంగా చావ్లా వేసిన 22 బంతుల్లో పాండ్యా 46 పరుగులు రాబట్టాడు.

Details

లెగ్ స్పిన్నర్లపై హార్ధిక్ పాండ్యాకు అద్భుత రికార్డు

ఐపీఎల్‌లో లెగ్ స్పిన్నర్లపై హార్దిక్ పాండ్యాకు అద్భుత రికార్డు ఉంది. అతను 53 ఇన్నింగ్స్‌లలో 130.10 స్ట్రైక్ రేట్‌తో 363 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 11 సార్లు లెగ్ స్పిన్నర్ల చేతిలో ఔట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ తరుపున ఈ సీజన్లో చావ్లా 21 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. హార్దిక్ 121 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 29.74 సగటుతో 2,260 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగంలో 53 వికెట్లను తీశాడు. ఈ 2023 సీజన్‌లో అతను 297 పరుగులు చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. చావ్లా 180 ఐపీఎల్ మ్యాచుల్లో 178 వికెట్లను పడగొట్టాడు.