Page Loader
Rishabh Pant: ఐపీఎల్ 2024కి రిషబ్ పంత్ అందుబాటులోకి రావడంపై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు 
ఐపీఎల్ 2024కి రిషబ్ పంత్ అందుబాటులోకి రావడంపై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు

Rishabh Pant: ఐపీఎల్ 2024కి రిషబ్ పంత్ అందుబాటులోకి రావడంపై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2024
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022 ఏడాది చివరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమిండియా వికెట్‌ కీపర్ రిషబ్‌ పంత్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న పంత్..ఇటీవల బెంగళూరులోని NCAలో త్రో స్పెషలిస్టులతో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్‌ 2024తో పునరాగమనం చేయాలని పంత్ చూస్తున్నాడు. అయితే పంత్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Details 

ఈ ఐపిల్ఎల్ కి పంత్ జట్టులోకి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాబోయే సీజన్‌లో రిషబ్ పంత్ అందుబాటులోకి రావడం "బోనస్" అని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఐపిల్ఎల్ లో పంత్ జట్టులోకి వస్తాడనే నమ్మకం ఉందని పాంటింగ్ పేర్కొన్నాడు. అయితే ఈ సీజన్‌లో అతను (పంత్) ఎంత ఫిట్‌గా ఉంటాడనే దానిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్పష్టత ఇవ్వలేదు. సోషల్ మీడియా పంత్ వీడియోలు గనుక చూస్తే.. అతను(పంత్)ఇప్పుడు బాగానే ఉన్నాడు. కానీ మొదటి గేమ్‌కి ఇంకా ఆరు వారాల దూరమే ఉంది. కాబట్టి పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడో లేదో అని ఖచ్చితంగా చెప్పలేమని పాంటింగ్ అన్నాడు.

Details 

నం.4లో పంత్ బ్యాటింగ్ 

ఒకవేళ నేను ఇప్పుడు కీపింగ్ చేస్తావా అని అడిగితే, ప్రతి మ్యాచ్ ఆడతానని, నేను ప్రతి గేమ్‌లో వికెట్ కీపింగ్ చేస్తానని నం.4లో బ్యాటింగ్ వస్తానని పంత్ చెబుతాడు. రిషబ్ పంత్ చాలా డైనమిక్ ప్లేయర్. అతను మా కెప్టెన్. గత సంవత్సరం మేము అతనిని చాలా మిస్ అయ్యాము. గత 12-13 నెలలుగా అతను చేస్తున్న ప్రయాణం దురదృష్టకరం,అతను ప్రాణాలతో బయటపడటం చాలా అదృష్టమని భావిస్తున్నామని, మళ్ళీ క్రికెట్ ఆడే అవకాశం అతడికి దక్కింది. అతను(పంత్) ఐపీఎల్ 2024 ఆడగలడని నమ్మకంగా ఉన్నాం. పంత్ కనీసం 14 ఆటలలో 10 మ్యాచ్ లు ఆడినా అది మాకు బోనసే అని పాయింటింగ్ చెప్పుకొచ్చాడు.

Details 

ట్రైనింగ్ ప్రారంభించిన పంత్ 

కాగా,ప్రస్తుతం పంత్ ట్రైనింగ్ ప్రారంభించాడు. అతను తన ట్రైనింగ్ సెషన్‌ల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ఇప్పుడు పంత్ కొన్ని నెలల క్రితం కంటే మెరుగ్గా కనిపిస్తున్నాడు. జనవరి 17న ఆఫ్ఘనిస్థాన్‌తో 3వ T20Iకి ముందు టీమ్ ఇండియా శిక్షణ సమయంలో.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత క్రికెట్ జట్టు సభ్యులతో అతను ఇటీవల కలుసుకున్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలతో పంత్ నవ్వుతూ కనిపించాడు.