Page Loader
IPL 2025: ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా?
ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా?

IPL 2025: ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం నాడు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఇన్నేళ్లుగా ఎదురుచూసిన టైటిల్‌ స్వప్నం నెరవేరడంతో ఆర్సీబీ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు అర్ధరాత్రి దాకా రోడ్లపై సంబరాల్లో మునిగిపోయారు. టపాసులు కాల్చడం, స్వీట్లు పంచుకోవడం, "ఆర్సీబీ.. ఆర్సీబీ" అంటూ నినాదాలు చేశారు.

Details

ఈసారి బెస్ట్ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనలు ఎవరివీ?

2025 సీజన్‌లో బ్యాటింగ్ విభాగంలో గుజరాత్ టైటాన్స్ డాషింగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ అద్భుతంగా రాణించాడు. మొత్తం 759 పరుగులతో టోర్నీలో అత్యధిక స్కోరర్‌గా నిలిచిన సుదర్శన్‌కు ఆరెంజ్ క్యాప్ లభించింది. దీంతోపాటు రూ.10 లక్షల ప్రైజ్ మనీని కూడా అందుకున్నాడు. బౌలింగ్ విభాగంలో గుజరాత్‌కు చెందిన ప్రసిద్ధ్ కృష్ణ తన దూకుడు కొనసాగించాడు. మొత్తం 15 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. ట్రోఫీతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

Details

 టాప్-5 బ్యాటర్లు (రన్స్ ఆధారంగా)

1. సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) - 759 పరుగులు 2. సూర్యకుమార్ యాదవ్ (ముంబయి ఇండియన్స్)- 717 పరుగులు 3. విరాట్ కోహ్లీ (ఆర్సీబీ) - 657 పరుగులు 4. శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) - 650 పరుగులు 5. మిచెల్ మార్ష్ (లక్నో సూపర్ జెయింట్స్)- 627 పరుగులు టాప్-5 బౌలర్లు (వికెట్లు ఆధారంగా) 1. ప్రసిద్ధ్ కృష్ణ (గుజరాత్ టైటాన్స్)- 25 వికెట్లు 2. నూర్ అహ్మద్ (చెన్నై సూపర్ కింగ్స్)- 24 వికెట్లు 3. హేజిల్‌వుడ్ (ఆర్సీబీ) - 22 వికెట్లు 4. ట్రెంట్ బౌల్ట్ (ముంబయి ఇండియన్స్) - 22 వికెట్లు 5. అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్) - 21 వికెట్లు

Details

పారితోషిక వివరాలు

విజేత (ఆర్సీబీ) - రూ.20 కోట్లు రన్నరప్ (పంజాబ్ కింగ్స్) - రూ.12.5 కోట్లు క్వాలిఫయర్స్ - ఒక్కో జట్టుకు రూ.7 కోట్లు ఎలిమినేటర్ - ఒక్కో జట్టుకు రూ.6.5 కోట్లు ఇతర ప్రత్యేక అవార్డులు ఎక్కువ సిక్సులు కొట్టిన ఆటగాడు - నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్) - 40 సిక్సులు బెస్ట్ క్యాచ్ - కమిందు మెండిస్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) ఐపీఎల్ 2025 సీజన్ ఆఖరి వరకూ ఉత్కంఠను కొనసాగించి, అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఆర్సీబీ టైటిల్‌తో తమ చరిత్రను తిరగరాసింది.