Page Loader
MI vs RCB: ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ముంబయిపై ఆర్సీబీ విజయం
ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ముంబయిపై ఆర్సీబీ విజయం

MI vs RCB: ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ముంబయిపై ఆర్సీబీ విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
11:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ సీజన్‌ 18లో భాగంగా ముంబయి ఇండియన్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది.

వివరాలు 

ముంబయి జట్టులో మెరిసిన హార్దిక్ పాండ్య,తిలక్ వర్మ

తిలక్ వర్మ 29 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్‌లతో 56 పరుగులు చేయగా,హార్దిక్ పాండ్య 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42 పరుగులతో చెలరేగిపోయాడు. అయితే కీలక సమయంలో ఈ ఇద్దరూ ఔటవడం ముంబయి చివర్లో తడబడింది. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసినా, వరుసగా వికెట్లు పడుతుండడంతో ముంబై విజయానికి దూరమైంది. విల్ జాక్స్ (22 పరుగులు, 18 బంతుల్లో), రోహిత్ శర్మ (17),రికెల్టన్ (17) పరుగులతో కొంత సమయం నిలబడ్డారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్య 4 వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చాడు. యశ్ దయాల్, జోష్ హేజల్‌వుడ్ తలో 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ ఒక్క వికెట్ తీశారు.

వివరాలు 

దూకుడుగా ఆడిన కోహ్లీ, పటీదార్ 

ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ (67 పరుగులు, 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రజత్ పటీదార్ (64 పరుగులు, 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌లు అందించారు. దేవ్‌దత్ పడిక్కల్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్లలో జితేశ్ శర్మ 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో అజేయంగా 40 పరుగులు చేసి స్కోరు వేగంగా పెంచాడు. ముంబయి బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య 2 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీసారు. విఘ్నేశ్ పుతుర్ ఒక్క వికెట్ సాధించాడు.