
IPL Playoffs: ఐపీఎల్ లో ప్లేఆఫ్‌కి అత్యధికసార్లు చేరిన జట్టు ఏదో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.ప్లేఆఫ్ పోటీలు క్రమంగా రసవత్తరంగా మారుతున్నాయి.
ఇప్పటి వరకూ 56మ్యాచ్‌లు ముగిశాయి. ఇందులో మూడు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగాయి.
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే),రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్),సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్آర్హెచ్) పోటీ నుంచి నిష్క్రమించగా,మరో ఏడు జట్లు పోటీలో కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకు ప్లేఆఫ్‌కి అత్యధికసార్లు అర్హత సాధించిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కావడం గమనార్హం.
ఐదుసార్లు ట్రోఫీని సొంతం చేసుకున్నఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉంది.
ఈ జాబితాలో ముంబయి ఇండియన్స్ రెండో స్థానం,ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా మూడో, నాలుగో, ఐదో స్థానాల్లో ఉన్నాయి.
వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
టాప్-5 జట్లలో ఆర్‌సీబీకి మాత్రం ఒక చెత్త రికార్డు ఉంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 12 సార్లు ఐపీఎల్ ప్లేఆఫ్‌కి చేరింది. ఇందులో ఐదుసార్లు విజేతగా నిలిచింది.
ఈ విజయాలు వరుసగా 2010, 2011, 2018, 2021, 2023లో వచ్చినవి. ఈ టైటిల్స్ అన్నింటినీ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో సాధించటం విశేషం.
ప్లేఆఫ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డును కూడా సీఎస్‌కే తన ఖాతాలో వేసుకుంది.
మొత్తం 26 మ్యాచ్‌లు ఆడి, అందులో 17 విజయాలు సాధించింది. మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లలో ఓటమి పాలైంది.
వివరాలు
ముంబయి ఇండియన్స్ (MI)
ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకు పదిసార్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించింది.
ఐదుసార్లు ట్రోఫీ గెలిచి, చెన్నైతో సమానంగా నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ విజయాలన్నీ రోహిత్ శర్మ నాయకత్వంలో వచ్చాయి. ఈసారి కూడా ప్లేఆఫ్‌కి చేరే అవకాశాలు ఉన్నాయి. ప్లేఆఫ్‌లలో ముంబయి 20 మ్యాచ్‌లు ఆడి, 13 గెలిచింది. ఏడింటిలో ఓడిపోయింది.
వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)
ఆర్‌సీబీ తొమ్మిది సార్లు ప్లేఆఫ్‌కి అర్హత పొందిన జట్లలో మూడో స్థానంలో ఉంది.
కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. ఈసారి మాత్రం తప్పక ట్రోఫీ సాధించాలన్న సంకల్పంతో తలపడుతోంది.
అన్ని విభాగాల్లో మంచి ప్రదర్శన కనబర్చుతూ ముందంజలో ఉంది.
ఈసారి ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఉన్నప్పటికీ, టైటిల్ గెలుస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
గత సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ, రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది.
మొత్తంగా ప్లేఆఫ్‌లలో ఆర్‌సీబీ 15 మ్యాచ్‌లు ఆడి, అందులో ఐదింటిలో మాత్రమే గెలిచింది. మిగిలిన పదింటిలో ఓటమి ఎదురైంది.
వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)
సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తొమ్మిది సార్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించింది. ఇందులో రెండు టైటిల్స్ సాధించింది.
2009లో డెక్కన్ ఛార్జర్స్‌గా ఉన్నప్పుడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ నాయకత్వంలో టైటిల్ గెలిచింది. అనంతరం 2016లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో సన్‌రైజర్స్‌గా ట్రోఫీ గెలుచుకుంది.
ఇటీవల పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో ఫైనల్‌కి చేరినా, కోల్‌కతా చేతిలో ఓడింది.
సన్‌రైజర్స్ మొత్తం 14 ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడి, 6 విజయాలు, 8 పరాజయాలు పొందింది.
ఈసారి జట్టు మొదటి మ్యాచ్‌లలో మెరిసినా, తరువాతి మ్యాచ్‌లలో అంత ప్రభావం చూపలేకపోయింది.
వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)
కేకేఆర్ ఇప్పటి వరకూ ఎనిమిదిసార్లు ప్లేఆఫ్‌కి చేరింది. 2012, 2014, 2024 సంవత్సరాల్లో మూడుసార్లు టైటిల్ గెలుచుకుంది.
గంభీర్ నాయకత్వంలో రెండు సార్లు, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఒకసారి విజేతగా నిలిచింది.
ప్లేఆఫ్‌లలో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి, 10 విజయాలు నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
ప్లేఆఫ్‌కి చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తప్పకుండా గెలవాలి. ఇతర జట్ల ఫలితాలు కూడా కేకేఆర్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.