IPL 2026: ముంబై ఇండియన్స్‌లోకి కేశవ్ మహారాజ్ ఎంట్రీ.. సాంట్నర్‌కు రీప్లేస్‌మెంట్
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులోకి సీనియర్ సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ చేరాడు. గాయంతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ స్థానంలో అతడిని రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారు. న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ భుజానికి గాయం కావడంతో ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు దిగువ భాగంలో కొనసాగుతోంది. కీలక దశలో జట్టుకు కొత్త బలం అవసరమవడంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
వివరాలు
రూ.75 లక్షలకు ముంబైలోకి కేశవ్
అనుభవజ్ఞుడైన ఎడమచేతి స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ఆడాడు. అంతకుముందు 2024లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో రెండు మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతనికి ఉంది. లీగ్ అధికారిక ప్రకటన ప్రకారం, మహారాజ్‌ను ముంబై ఇండియన్స్ రూ.75 లక్షల ఫీజుకు జట్టులోకి తీసుకుంది. ఇప్పటివరకు కేశవ్ మహారాజ్ 218 టీ20 మ్యాచ్‌ల్లో 191 వికెట్లు తీసి, సగటు 27.63గా నిలిపాడు. అనుభవం, స్థిరమైన బౌలింగ్‌తో జట్టుకు అతను కీలకంగా మారే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్..
🚨 Player Replacement 🚨@mipaltan sign Keshav Maharaj as replacement for the injured Mitchell Santner.
— IndianPremierLeague (@IPL) April 27, 2026
More details 🔽 | #TATAIPL | #KhelBindaas https://t.co/677Ba26V8n