LOADING...
IPL 2026 Orange Cap Race: ఆరెంజ్ క్యాప్ రేసులో కొత్త ట్విస్ట్.. కోహ్లీకి షాక్
ఆరెంజ్ క్యాప్ రేసులో కొత్త ట్విస్ట్.. కోహ్లీకి షాక్

IPL 2026 Orange Cap Race: ఆరెంజ్ క్యాప్ రేసులో కొత్త ట్విస్ట్.. కోహ్లీకి షాక్

వ్రాసిన వారు Moogati Shabari
May 04, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. జట్ల మధ్య జరిగే పోటీ ఒక వైపు ఉంటే, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల కోసం జరిగే పోటీ మరో వైపు అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌ల కోసం జరిగే పోటీ ప్రతి మ్యాచ్‌తో మారుతూ ఆసక్తిని పెంచుతోంది. తాజాగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఈ పోటీల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అర్ధశతకంతో మెరిసి, విరాట్ కోహ్లీ స్థానాన్ని ప్రభావితం చేశాడు.

వివరాలు

మరింత రసవత్తరంగా మ్యాచ్‌లు..

ఈ సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో త్వరగా ఔట్ అయినప్పటికీ, అంతకుముందు చేసిన పరుగుల ఆధారంగా కేఎల్ రాహుల్‌ను అధిగమించి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం అభిషేక్ 440 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, కేఎల్ రాహుల్ 433 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య తేడా కేవలం 7 పరుగులు మాత్రమే ఉండటంతో రాబోయే మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారనున్నాయి.

వివరాలు

కోహ్లీ తర్వాత ఎవరెవరు ఉన్నారంటే?

గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ పంజాబ్ కింగ్స్‌పై 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతని మొత్తం పరుగులు 10 మ్యాచ్‌లలో 385కి చేరి టాప్-5లోకి ప్రవేశించాడు. దీనివల్ల ఇంతవరకు ఐదో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ (379 పరుగులు) ఆరో స్థానానికి దిగజారాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ (425 పరుగులు) మూడో స్థానంలో, వైభవ్ సూర్యవంశీ (404 పరుగులు) నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

Advertisement

వివరాలు

హోరా హోరీగా.. పర్పుల్ క్యాప్ పోటీ

బౌలింగ్ విభాగంలో పర్పుల్ క్యాప్ పోటీ కూడా హోరాహోరీగా సాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 17 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అదే సంఖ్యలో వికెట్లు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కాంబోజ్, తక్కువ ఎకానమీ రేటు కారణంగా రెండో స్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌పై రెండు వికెట్లు సాధించిన కగిసో రబడ (16 వికెట్లు) మూడో స్థానానికి చేరాడు. జోఫ్రా ఆర్చర్, ఇషాన్ మలింగ చెరో 15 వికెట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Advertisement

వివరాలు

యువ ఆటగాళ్ల మధ్య రేస్..

ఈ సీజన్‌లో ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉండటం గమనార్హం. మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ వంటి ప్రముఖ బౌలర్లు 11 వికెట్లతో వరుసగా 8వ, 9వ స్థానాల్లో ఉన్నారు. టోర్నమెంట్ ప్లేఆఫ్స్ దశకు దగ్గరవుతున్న కొద్దీ ఈ క్యాప్‌ల కోసం పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. తాజా ఫలితాల ప్రకారం హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ తమ ప్రభావాన్ని చూపుతున్నారు.

Advertisement