LOADING...
IPL 2026 Points Table : ఓటమితోనూ టాప్-4లో పంజాబ్.. ముంబై గెలుపు వృథా..ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నదెవరంటే
ఓటమితోనూ టాప్-4లో పంజాబ్.. ముంబై గెలుపు వృథా..ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నదెవరంటే

IPL 2026 Points Table : ఓటమితోనూ టాప్-4లో పంజాబ్.. ముంబై గెలుపు వృథా..ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నదెవరంటే

వ్రాసిన వారు Moogati Shabari
May 15, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుతుండటంతో పాయింట్ల పట్టికలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించినా, పాయింట్ల పట్టికలో పెద్ద మార్పులు చోటుచేసుకోలేదు. మరోవైపు, పంజాబ్ కింగ్స్ పరిస్థితి క్లిష్టంగా మారింది. వరుస పరాజయాలతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ప్రమాదంలో పడగా, ముంబైకి ఈ విజయం కేవలం గౌరవప్రదమైన ఫలితంగా మాత్రమే మిగిలింది.

వివరాలు

ప్లేఆఫ్స్ గెలవాలంటే ఆ మ్యాచ్‌ల్లో గెలవాల్సిందే..

సీజన్ ఆరంభంలో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క పరాజయం కూడా లేకుండా 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై అభిమానులను నిరాశకు గురిచేసింది. అయినప్పటికీ, ప్రారంభంలో సాధించిన పాయింట్ల ఆధారంగా ప్రస్తుతం 13 పాయింట్లు, +0.355 నెట్ రన్ రేట్‌తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆ జట్టుకు కీలకం. ప్లే ఆఫ్స్‌లో నిలవాలంటే ఆ రెండింటిలోనూ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు

ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న ముంబై..

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 58వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఫలితంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ప్రయాణానికి గట్టి దెబ్బ తగిలింది. అయితే ముంబైకి మాత్రం ఈ గెలుపుతో పెద్దగా ప్రయోజనం కలగలేదు. 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసిన ఆ జట్టు ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ముంబై కంటే దిగువన ఆరు పాయింట్లతో లక్నో సూపర్ జెయింట్స్ మాత్రమే ఉంది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న నేపథ్యంలో, ఈ విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే పరిమితమైంది.

Advertisement

వివరాలు

ప్లేఆఫ్స్ చేరిన ఆ నాలుగు జట్లు..

ఇక పాయింట్ల పట్టికలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు నమోదు చేసి 16 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. ముఖ్యంగా +1.053 నెట్ రన్ రేట్ ఆ జట్టుకు అదనపు బలంగా మారింది. అదే సంఖ్యలో పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో ఉంది. మరోవైపు, 14 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు ఖాయం చేసుకుంది.

Advertisement