IPL 2026: ఆఖరి ర్యాంకు కోసం ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్ల పోటీ..మరి ఇలా తయారయ్యారేంటి బ్రో..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ముందంజలో ఉంది. వారు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించాారు. మొత్తం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాకుండా, మొత్తం 10 జట్లలో ఈ జట్టుకే అత్యుత్తమ రన్‌రేట్ ఉంది. ఇక రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ 7 పాయింట్లతో నిలిచింది. ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే, 9 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ముంబయి ఇండియన్స్‌పై ఆదివారం విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ జట్టు నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది.
వివరాలు
నాలుగో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్..
లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలుపుతో గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా 4 పాయింట్లు సాధించి ఐదో స్థానాన్ని పొందింది. అదే మ్యాచ్‌లో ఓడిపోయిన లక్నో జట్టు 4 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉంది. అయితే గుజరాత్‌తో పోలిస్తే లక్నో జట్టు రన్‌రేట్ తక్కువగా ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ జట్టు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి, 2 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధిస్తే, ఈ జట్టు 4 పాయింట్లతో ఐదో స్థానానికి చేరే అవకాశం ఉంది. భారీ తేడాతో గెలిస్తే నాలుగో స్థానాన్ని కూడా దక్కించుకోగలదు. కారణం ఏమిటంటే గుజరాత్, లక్నో జట్ల రన్‌రేట్లు సన్‌రైజర్స్ కంటే తక్కువగా ఉన్నాయి.
వివరాలు
ఆ జట్లన్నీ ఆఖరి స్థానంలోకి..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్. చెన్నై, ముంబై జట్లు తలో ఐదు సార్లు టైటిల్ గెలుచుకోగా, కోల్‌కతా జట్టు మూడు సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే ఈసారి ఐపీఎల్ 2026లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి, ఎనిమిదో స్థానంలో ఉంది.