LOADING...
IPL 2026: తల ఎత్తుకునేలా చేస్తాడనుకుంటే.. తలదించుకుని వెళ్లిపోతావా.. శాంసన్‌పై ఆశలుపెట్టుకున్న చెన్నై ఫ్యాన్స్‌కు షాక్
తల ఎత్తుకునేలా చేస్తాడనుకుంటే.. తలదించుకుని వెళ్లిపోతావా.. శాంసన్‌పై ఆశలుపెట్టుకున్న చెన్నై ఫ్యాన్స్‌కు షాక్

IPL 2026: తల ఎత్తుకునేలా చేస్తాడనుకుంటే.. తలదించుకుని వెళ్లిపోతావా.. శాంసన్‌పై ఆశలుపెట్టుకున్న చెన్నై ఫ్యాన్స్‌కు షాక్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 03, 2026
09:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నో ఆశలు పెట్టుకుని జట్టులోకి తీసుకున్నప్పటికీ, ఇప్పుడు చెన్నైకి భారంగా మారిన శాంసన్ ప్రదర్శన చూస్తే విమర్శలు తప్పవు. అతని స్కోర్లు పరిశీలిస్తే నిరాశ కలిగించేలా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి పోరులో పరాజయం పొందిన చెన్నై సూపర్ కింగ్స్, ఈరోజు తమ హోం గ్రౌండ్ అయిన ఎంఏ చిదంబరం స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కొంది. టాస్ గెలిచిన సీఎస్‌కే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, ప్రారంభం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ముందు మాదిరిగానే, ఈ మ్యాచ్‌లో కూడా చెన్నై ఇన్నింగ్స్‌ను సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ప్రారంభించారు. మ్యాచ్‌లో 7 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసిన సంజు బ్యాటింగ్ అందర్నీ నిరాశపరిచింది.

వివరాలు 

14 పరుగులకే తొలి వికెట్..ఫ్యాన్స్ నిరాశ

సంజు త్వరగా పెవిలియన్ చేరడంతో చెన్నై 14 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. శాంసన్ వికెట్ త్వరగా పడిపోయినా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మహాత్రే కలిసి జట్టును నిలబెట్టారు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో సీఎస్‌కే కేవలం 10 ఓవర్లలోనే 100 పరుగులు నమోదు చేసింది. సీఎస్‌కే తరపున అద్భుతంగా ఆడిన ఆయుష్ మహాత్రే, తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత నుంచి ధైర్యంగా బ్యాటింగ్ చేసిన అతను, కేవలం 29 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. చివరకు 73 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.

Advertisement