Loading...
Abhishek Porel: ఐపీఎల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్టు.. అసలు కారణం ఇదే!
ఐపీఎల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్టు.. అసలు కారణం ఇదే!

Abhishek Porel: ఐపీఎల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్టు.. అసలు కారణం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2026
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న అభిషేక్‌ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారం, క్రిమినల్‌ బెదిరింపులు సహా పలు తీవ్ర ఆరోపణలు ఈ కేసులో నమోదైనట్లు సమాచారం. హుగ్లీ రూరల్‌ ఎస్పీ కున్వర్‌ భూషణ్‌ సింగ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. డమ్‌డమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎమామి సిటీలో అభిషేక్‌ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత జూన్‌లో ఓ వైద్య విద్యార్థిని ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు

మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామని..

తనకు, అభిషేక్‌ పోరెల్‌కు గత మూడేళ్లుగా సంబంధం ఉందని వైద్య విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

అయితే గత ఏడాది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని.. ఆ తర్వాత పోరెల్‌ తనకు దూరంగా ఉండటం ప్రారంభించాడని ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు.

తనను వివాహం చేసుకుంటానని అభిషేక్‌ పోరెల్‌ హామీ ఇచ్చాడని.. ఇప్పుడు మాత్రం పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.

వివాహం చేసుకుంటానన్న హామీతో తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అనంతరం తనపై దాడి చేసి బెదిరించాడని కూడా ఆమె ఆరోపించినట్లు సమాచారం.

వివరాలు

అరెస్ట్‌కు కలకత్తా హైకోర్టు ఆదేశాలు

ఈ కేసులో అభిషేక్‌ పోరెల్‌ను అరెస్ట్‌ చేయాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే పోలీసులు చర్యలు తీసుకుని పోరెల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను అభిషేక్‌ పోరెల్‌ గతంలోనే ఖండించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులోని ఆరోపణలు దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో నిర్ధారణ కావాల్సి ఉంది.

ADVERTISEMENT

వివరాలు

ఎవరీ అభిషేక్‌ పోరెల్‌?

అభిషేక్‌ పోరెల్‌ ఎడమచేతి వాటం కలిగిన టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌. ఆయన 2023 నుంచి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 108 పరుగులు చేశాడు. 2021-22 సీజన్‌లో బెంగాల్‌ తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పోరెల్‌.. ఇప్పటివరకు 32 ఫస్ట్‌క్లాస్‌, 23 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడాడు.

గతంలో భారత్‌-ఏ జట్టుతో కలిసి యూకే, ఆస్ట్రేలియా పర్యటనలకు కూడా వెళ్లాడు.

ADVERTISEMENT