LOADING...
IPL Playoffs Scenario: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు హీట్‌.. రెండు జట్లు ఔట్‌, 8 టీమ్‌లకు ఛాన్స్‌!
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు హీట్‌.. రెండు జట్లు ఔట్‌, 8 టీమ్‌లకు ఛాన్స్‌!

IPL Playoffs Scenario: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు హీట్‌.. రెండు జట్లు ఔట్‌, 8 టీమ్‌లకు ఛాన్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 11, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026 సీజన్‌ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్‌ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. టాప్‌-4లో చోటు దక్కించుకునేందుకు జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. అయితే ఆదివారం ముంబయి ఇండియన్స్‌పై ఆర్సీబీ చివరి బంతికి సాధించిన థ్రిల్లింగ్‌ విజయంతో ప్లేఆఫ్స్‌ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ ఓటమితో ముంబయి ఇండియన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ అధికారికంగా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇక మిగిలిన ఎనిమిది జట్ల పరిస్థితి ఇలా ఉంది.

వివరాలు

ఆర్సీబీ

11 మ్యాచ్‌లు ఆడిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 14 పాయింట్లతో పాటు +1.103 నెట్‌ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో విజయం సాధిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ బెర్తు దాదాపు ఖాయమవుతుంది. ఒకవేళ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే 20 పాయింట్లతో క్వాలిఫయర్‌-1కు చేరి ఫైనల్‌కు వెళ్లేందుకు రెండు అవకాశాలు దక్కించుకోనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరెంజ్‌ ఆర్మీ కూడా 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. అయితే నెట్‌ రన్‌రేట్‌ +0.737 మాత్రమే ఉండటంతో రెండో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలవాలి. మే 22న ఆర్సీబీతో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌ క్వాలిఫయర్‌-1 స్థానాన్ని నిర్ణయించే అవకాశముంది.

వివరాలు

గుజరాత్‌ టైటాన్స్

గుజరాత్‌ కూడా 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించింది. అయితే ఈ జట్టు నెట్‌ రన్‌రేట్‌ +0.228 మాత్రమే. ప్లేఆఫ్స్‌ అవకాశాలను బలంగా నిలబెట్టుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలవాల్సిందే. మే 12న హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్‌ ఇరుజట్లకూ అత్యంత కీలకంగా మారింది. పంజాబ్‌ కింగ్స్‌ 10 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ ఇప్పటికే 13 పాయింట్లతో మంచి స్థితిలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే 17 పాయింట్లతో సునాయాసంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. దిల్లీ, ముంబయి, ఆర్సీబీ, లఖ్‌నవూతో ఈ జట్టుకు ఇంకా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

Advertisement

వివరాలు

చెన్నై సూపర్‌ కింగ్స్

ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న సీఎస్కే కొంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే 16 పాయింట్లకు చేరుతుంది. కానీ +0.185 నెట్‌ రన్‌రేట్‌ మాత్రమే ఉండటం ఆ జట్టుకు ప్రతికూలంగా మారుతోంది. నేరుగా అర్హత సాధించాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటినీ గెలవాల్సిన పరిస్థితి ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌ రాజస్థాన్‌ కూడా 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిస్తే ప్లేఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోవడంతో ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ +0.082కు పడిపోయింది. నాలుగో స్థానం కోసం సీఎస్కేతో నేరుగా పోటీ పడే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు

కోల్‌కతా నైట్‌రైడర్స్

కేకేఆర్‌కు ప్లేఆఫ్స్‌ అవకాశాలు చాలా కష్టంగా మారాయి. 10 మ్యాచ్‌ల్లో 9 పాయింట్లు మాత్రమే సాధించిన ఈ జట్టు 17 పాయింట్ల మార్క్‌ను చేరుకోవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా సీఎస్కే, రాజస్థాన్‌ ఫలితాలు కీలకమవుతాయి. దిల్లీ క్యాపిటల్స్‌ 11 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలే సాధించిన దిల్లీ సాంకేతికంగా మాత్రమే ప్లేఆఫ్స్‌ రేసులో ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే మాత్రమే 14 పాయింట్లకు చేరుకుంటుంది. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. దీంతో దిల్లీ అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి.

Advertisement