
Black Tickets: ఉప్పల్‌లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. పోలీసుల అదుపులో నిందితుడు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.
అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్ల బ్లాక్ దందా జోరందుకుంది.
క్రికెట్ ఫ్యాన్స్ తమ అభిమాన ఆటగాళ్లను చూడటానికి ఎంతటి రేటైనా పెట్టేందుకు వెనుకాడటం లేదు.
దీన్ని అవకాశంగా తీసుకున్న కొంతమంది టికెట్లను బ్లాక్‌లో అమ్ముతూ భారీగా లాభాలు గడిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Details
ఉప్పల్‌లో టికెట్ బ్లాక్ దందా - ఒకరు అరెస్టు
సన్‌రైజర్స్ - రాజస్థాన్ మ్యాచ్ టికెట్లను ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద బ్లాక్‌లో అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుంచి టిక్కెట్లు స్వాధీనం చేసుకుని, ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
రేపటి మ్యాచ్‌కు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 300 మంది పోలీసులు ప్రత్యేకంగా విధులు నిర్వహించనున్నారు.
Details
భద్రతా ఏర్పాట్ల వివరాలు
1218 మంది పోలీసులు లా అండ్ ఆర్డర్ కోసం విధులు
12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీసులు మోహరింపు
450 సీసీ కెమెరాలు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
బాంబ్ స్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో క్షుణ్ణంగా తనిఖీలు
మహిళా భద్రత కోసం షీ టీమ్స్ మఫ్టీలో నిఘా
Details
స్టేడియం వద్ద నిషేధాలు
స్టేడియంలోకి కొన్ని వస్తువులను తీసుకురావడానికి అనుమతి లేదు.
వాటర్ బాటిల్స్
ల్యాప్‌టాప్‌లు
మ్యాచ్ బాక్స్‌లు
అంబ్రెల్లాలు
ఎలక్ట్రానిక్ డివైస్‌లు
అదేవిధంగా మ్యాచ్‌కు వచ్చే అభిమానుల కోసం 5 చోట్ల పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మొత్తం మీద, ఉప్పల్ వేదికగా ఆసక్తికరమైన పోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, బ్లాక్ టికెట్లపై పోలీసుల దృష్టి సారించారు.