LOADING...
ODI World Cup 2023: ఇషాన్ టు ఇన్ వన్ ప్లేయర్.. సంజు శాంసన్‌తో పోటీ లేదు!
ఇషాన్ టు ఇన్ వన్ ప్లేయర్.. సంజు శాంసన్‌తో పోటీ లేదు!

ODI World Cup 2023: ఇషాన్ టు ఇన్ వన్ ప్లేయర్.. సంజు శాంసన్‌తో పోటీ లేదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2023
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే టీమిండియాను జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే భారత జట్టులో చోటు ఆశించిన చాలా మంది ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. సంజుశాంసన్ కు అవకాశం దక్కుతుందని భావించినా, అతడి స్థానంలో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ ఎంపికపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు.

Details

ఇషాన్, సంజు శాంసన్ మధ్య్ పోటీ లేదు

ఇషాన్ టూ ఇన్ వన్ ప్లేయర్ అని, ఇషాన్, సంజు శాంసన్ మధ్య పోటీ లేదని రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇషాన్ కిషన్ చాలా పాత్రలను పోషిస్తాడని, బ్యాకప్ వికెట్ ఓపెనర్ కూడా అని, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్థానానికి బ్యాకప్‌గా ఉంటాడని, ఆ స్థానంలో బరిలోకి దిగి మంచి స్కోర్లు సాధిస్తాడని, అతడు నిస్వార్థ ఆటగాడు అని పేర్కొన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాడని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. ఇక భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 25 నుంచి 40 ఓవర్ల మధ్యలో పరుగులను రాబట్టులేక ఇబ్బంది పడుతున్నారని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వెల్లడించారు.