Page Loader
IPL 2025: అయ్యర్‌ vs కోహ్లీ.. తొలి ఫైనల్ బెర్తు ఎవరిదో?
అయ్యర్‌ vs కోహ్లీ.. తొలి ఫైనల్ బెర్తు ఎవరిదో?

IPL 2025: అయ్యర్‌ vs కోహ్లీ.. తొలి ఫైనల్ బెర్తు ఎవరిదో?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

నెలన్నర రోజులుగా అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న ఐపీఎల్‌ 2025 సీజన్‌ కీలక దశకు చేరుకుంది. లీగ్‌ దశ ముగిశాక, గురువారం నుంచి ప్లేఆఫ్స్‌ ప్రారంభంకానున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ కింగ్స్‌ - బెంగళూర్ రాయల్ ఛాాలెంజర్స్ (ఆర్‌సీబీ) జట్లు భీకర పోరుకు సిద్ధమయ్యాయి. చండీగఢ్‌ శివారులో కొత్తగా నిర్మితమైన ముల్లాన్‌పూర్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్‌ దశలో అద్భుత విజయాలతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టాప్‌-2లో చోటు దక్కించుకున్న పంజాబ్‌, ఆర్‌సీబీ... టైటిల్‌ ఆశలు చిగురించాయి. పంజాబ్‌ సమిష్టిగా చక్కటి ప్రదర్శన కనబరచి అగ్రస్థానంలో నిలవగా, ఈసారి అయినా ఐపీఎల్‌ ట్రోఫీని అందుకోవాలని ఆర్‌సీబీ సంకల్పించుకుంది.

Details

18 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడని ఆర్సీబీ, పంజాబ్

సొంత గడ్డపై తొలి ఫైనల్‌ బెర్తు దక్కించుకునేందుకు పంజాబ్‌ బరిలోకి దిగుతుండగా, లక్నోపై విజయం సాధించి ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో ఉంది. 18 ఏళ్లుగా ఈ రెండు జట్లు ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడలేదు. ఈ సారి చరిత్రను తిరగరాయాలన్న నమ్మకంతో బరిలోకి దిగుతున్నాయి. 2014లో పంజాబ్‌ ఫైనల్‌ చేరగా, 2016లో ఆర్‌సీబీ తుదిపోరులో నిలిచింది. టైటిల్‌ మాత్రం కలగానే మిగిలిపోయింది. కానీ ఈ సీజన్‌లో యువ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ స్టార్‌లతో ఈ రెండు జట్లు బలంగా ఉన్నాయి. అభిమానుల అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ, లీగ్‌ను రసవత్తరంగా మార్చాయి.

Details

అయ్యర్‌ వర్సెస్‌ కోహ్లీ 

ఈ కీలక మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లీ మధ్య ప్రతిష్టాత్మక పోరు కూడా చూడబోతున్నాం. లీగ్‌ దశలో బెంగళూరును వారి సొంతగడ్డపై ఓడించిన పంజాబ్‌కు, కోహ్లీ ముల్లాన్‌పూర్‌లో బదులు చెప్పాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇద్దరూ తమ జట్లను అండగా నిలిపిన కీలక ఆటగాళ్లే. ఇప్పటి వరకూ కోహ్లీ 608 పరుగులు (స్ట్రైక్‌రేట్‌ 147.91), అయ్యర్‌ 514 పరుగులు (స్ట్రైక్‌రేట్‌ 171.90) సాధించారు. క్వాలిఫయర్‌-1లో వీరిద్దరూ అదే ఫామ్‌ కొనసాగిస్తే, అభిమానులకు మజాగా మారనుంది. ఇతర కీలక అంశాలను పరిశీలిస్తే, పంజాబ్‌కు డబ్ల్యూటీసీ కారణంగా యాన్సెన్‌ సేవలను కోల్పోయింది. ఇక ఆర్‌సీబీకి టిమ్‌ డేవిడ్‌ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.

Details

ఫైనల్‌ బెర్తు కోసం తొలి పోరాటం

ఇదే సమయంలో గాయం నుంచి కోలుకున్న చాహల్‌ తిరిగి రావడం పంజాబ్‌కు ఊరటనివ్వగా, జోష్‌ హాజిల్‌వుడ్‌ రీ ఎంట్రీ ఆర్‌సీబీ కూడా బౌలింగ్ విభాగంలో పట్టిష్టంగా కన్పిస్తోంది. ఈ క్వాలిఫయర్‌లో విజయం సాధించిన జట్టుకు నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉండగా, ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో ఛాన్స్‌ లభించనుంది. మొత్తంగా చూస్తే, ఈరోజు జరిగే పోరు ఐపీఎల్‌ 2025లోని అత్యంత ఉత్కంఠభరితమైన దశకు నాంది పలుకనుంది. ఏ జట్టు ముందడుగు వేస్తుందో.. మరికొన్ని గంటల్లో తేలనుంది.

Details

ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే

పంజాబ్‌ జట్టు ప్రియాంశ్‌, ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌, ఇంగ్లిస్‌, శ్రేయాస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), నేహాల్‌ వధేరా, శశాంక్‌సింగ్‌, స్టొయినిస్‌, అజ్మతుల్లా, జెమీసన్‌, హర్‌ప్రీత్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, చాహల్‌. బెంగళూరు జట్టు కోహ్లీ, సాల్ట్‌, మయాం క్‌, రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), జితేశ్‌శర్మ, కృనాల్‌పాండ్యా, లివింగ్‌స్టోన్‌, షెఫర్డ్‌, భువనేశ్వర్‌, దయాల్‌, హాజిల్‌వుడ్‌, సుయాశ్‌.