Page Loader
Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌ నుండి నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు జ‌కోవిచ్ ఔట్‌
ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌ నుండి నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు జ‌కోవిచ్ ఔట్‌

Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌ నుండి నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు జ‌కోవిచ్ ఔట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2024
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో సెర్భియా స్టార్, ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు నొవాక్ జ‌కోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. శుక్రవారం 4వ సీడ్ జానిక్ సిన్నర్‌,జకోవిచ్ మధ్య సెమీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ లో జానిక్ సిన్నర్‌ 3 గంటల 22 నిమిషాల్లో 6-1, 6-2, 6-7 (6/8), 6-3తో నొవాక్ జొకోవిచ్‌ పై విజయం సాధించాడు. దీంతో సిన‌ర్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఫైన‌ల్‌కు చేరుకున్నారు. గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం సిన‌ర్‌కు ఇదే తొలిసారి. ఆదివారం ఫైన‌ల్ మ్యాచ్‌ జ‌ర‌గ‌నుంది. మ‌రో సెమీఫైన‌ల్ మ్యాచులో మ‌ద్వెదెవ్‌-జెరెవ్‌లో ఎవ‌రు గెలిస్తే వారితో సిన‌ర్ ఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డ‌నున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫైనల్ లో జానిక్ సిన్నర్‌