
భారత్‌పై వన్డే సిరీస్ నెగ్గాక.. వార్నర్ సెలబ్రేషన్స్.. తగ్గేదేలా
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ పై వన్డే సిరీస్ నెగ్గాక సెలబ్రేషన్ సమయంలో వార్నర్ పుష్ప పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అయితే చైన్నైలో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
ట్రోఫీ అందుకున్న తర్వాత వార్నర్ తనదైన స్టెయిల్ లో తగ్గేదేలా అంటూ ఫోటోలకు ఫోజులిచ్చాడు.
ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కూడా పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాటకు హీరో నడిచినట్లు వార్నర్ తన యాక్షన్ లో చూపించి అభిమానులను అలరించాడు.
బుధవారం చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. ఫలతంగా స్వదేశంలో నాలుగేండ్ల తర్వాత తొలి సిరీస్ ఓటమిని చవిచూసింది.
ఆడమ్ జంపా
ఆడమ్ జంపాకు మ్యాన్ ఆప్ ద మ్యాచ్
ఆస్ట్రేలియాను 269 పరుగులకు భారత్ ఆలౌటైంది. లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 10 ఓవర్లలో 65-1 స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 17 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. వెంటనే శుభ్‌మాన్ గిల్(37) కూడా వెంటనే పెవిలియానికి చేరాడు.
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 69 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.రాహుల్ జంపా బౌలింగ్‌లో ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది.
ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా (40), రవీంద్ర జడేజా (18) కూడా జంపా బౌలింగ్ ఔట్ కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో జంపాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మార్ష్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కాయి.