Loading...
Joe Root: ద్రావిడ్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన జో రూట్
ద్రావిడ్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన జో రూట్

Joe Root: ద్రావిడ్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన జో రూట్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 15, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అడిలైడ్ వన్డేలో జో రూట్ చేతికి వచ్చిన రెండు క్యాచ్‌లు అతడి ఖాతాలో చరిత్రను లిఖించాయి. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆరంభంలో ట్రావిస్ హెడ్, కెప్టెన్ మిచెల్ మార్ష్ ఇచ్చిన క్యాచ్‌లను అందుకున్న రూట్.. తన అంతర్జాతీయ క్యాచ్‌ల సంఖ్యను 335కు చేర్చాడు. దీంతో 334 క్యాచ్‌లు పట్టిన భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు. ద్రవిడ్ 509 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా, రూట్ కేవలం 402 మ్యాచ్‌ల్లోనే అతడిని అధిగమించడం విశేషం.

Details

అత్యధిక క్యాచ్‌ల జాబితాలో ఏడో స్థానం

అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా కాకుండా ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో రూట్ ఏడో స్థానానికి చేరుకున్నాడు.

ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 440 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ 364 క్యాచ్‌లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్టార్ విరాట్ కోహ్లీ 347 క్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

Details

వన్డేల్లో 50 అర్ధసెంచరీల మైలురాయి

రూట్ ఫీల్డింగ్‌లోనే కాదు, బ్యాటింగ్‌లోనూ తన మార్క్ చూపించాడు. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో 68 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 62 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో వన్డే కెరీర్‌లో 50వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో ఈ మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ADVERTISEMENT

Details

ఒకే మ్యాచ్‌లో రెండు ప్రత్యేక ఘనతలు

2013లో వన్డేల్లో అరంగేట్రం చేసిన జో రూట్.. అప్పటి నుంచి ఇంగ్లండ్ జట్టుకు కీలక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 355 పరుగులు చేసింది.

ఆ ఇన్నింగ్స్‌లో రూట్ సాధించిన 62 పరుగులు జట్టు స్కోరుకు తోడయ్యాయి. ఒకే మ్యాచ్‌లో ద్రవిడ్ క్యాచ్‌ల రికార్డును అధిగమించడం, వన్డేల్లో 50 అర్ధసెంచరీలు పూర్తి చేయడం అతడి నిలకడకు నిదర్శనంగా నిలిచాయి.

ADVERTISEMENT