జో రూట్ సూపర్ సెంచరీ
టెస్టులో ఇంగ్లండ్ జట్టు స్పీడ్‌ను పెంచుతోంది. గతేడాది నుంచి బజ్ బాల్ విధానంలో టెస్టు స్వరూపాన్నే ఇంగ్లండ్ మార్చేసింది. తాజాగా న్యూజిలాండ్ జరుగుతున్న టెస్టులో కూడా అదే జోరును కొనసాగిస్తోంది. రెండు టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 315 పరుగులను చేసింది. జో రూట్ 182 బంతుల్లో సెంచరీ చేసి సత్తా చాటాడు రెండో టెస్టులో జోరూట్ సెంచరీ చేసి తన కెరియర్‌లో 29వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. రెండో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌కు బ్యాటింగ్ అప్పగించింది.
జో రూట్ సాధించిన రికార్డులివే
ఇంగ్లండ్ జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే (2), బెన్ డకెట్ (9)లతో పాటు ఓలీ పోప్ (10) విఫలమయ్యారు. అయితే జో రూట్, బ్రూక్ సెంచరీలతో కదం తొక్కి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జో రూట్ ఇప్పటివరకు 129 టెస్టులు ఆడి 10,800 పరుగులను చేశారు. ఇందులో ఐదు డబుల్ సెంచరీలు, 29 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ బ్యాటర్లలో అలిస్టర్ కుక్ (12,472) మాత్రమే ఎక్కువ టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు ఉంది. పాక్‌లో పాకిస్తాన్‌ను 3-0తో ఇంగ్లండ్ ఓడించిన విషయం తెలిసిందే.