Page Loader
సౌదీ అరేబియా క్లబ్ అల్-ఎట్టిఫాక్‌లో చేరిన జోర్డాన్ హెండర్సన్
సౌదీ అరేబియా క్లబ్ అల్-ఎట్టిఫాక్‌లో చేరిన జోర్డాన్ హెండర్సన్

సౌదీ అరేబియా క్లబ్ అల్-ఎట్టిఫాక్‌లో చేరిన జోర్డాన్ హెండర్సన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2023
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ మిడ్‌ఫీల్డర్ జోర్డాన్ హెండర్సన్ సౌదీ అరేబియా క్లబ్ అల్-ఎటిఫాక్‌లో చేరాడు. 2011 జూన్‌లో అతను లివర్ పూల్ జట్టులోకి వచ్చాడు. తాజాగా సౌదీ అరేబియా క్లబ్ అల్-ఎటిఫాక్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. హెండర్సన్ లివర్‌పూల్‌ జట్టులో విజయవంతంగా రాణించాడు. హెండర్సన్ లివర్‌పూల్ తరఫున 492 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 33 గోల్స్ చేయడంతో పాటు 57 అసిస్ట్‌లు చేశాడు. ముఖ్యంగా అతను ప్రీమియర్ లీగ్‌లో రెడ్స్ కోసం మొత్తం 360 మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో 29 గోల్స్, 43 అసిస్ట్‌లు సాధించాడు. 2009-10 సీజన్ ప్రారంభం నుండి హెండర్సన్ ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 430 ప్రదర్శనలు చేశాడు.

Details

హెండర్సన్ సాధించిన రికార్డులివే

ప్రీమియర్ లీగ్‌లో హెండర్సన్ సుందర్‌ల్యాండ్ తరపున 71 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో నాలుగు గోల్స్, ఏడు అసిస్ట్‌లను అందించాడు. 2008-09లో కోవెంట్రీ సిటీ తరుపున 13 ప్రదర్శనలు ఆడి, అతను ఒక గోల్ చేసి మూడు అసిస్ట్‌లు చేశాడు. అదే విధంగా ప్రీమియర్ లీగ్ 2022-23 సీజన్‌లో హెండర్సన్ రెడ్స్ తరపున 35 మ్యాచులు ఆడాడు. ఇందులో రెండు అసిస్ట్‌లు సాధించాడు. రెడ్స్ తరుపున 2019-20లో ప్రీమియర్ లీగ్ టైటిల్ ను గెలుచుకున్నాడు. 2011-12, 2021-22లో వరుసగా రెండు లీగ్ కప్ గౌరవాలను గెలుచుకున్నాడు. 2018-19లో లివర్‌పూల్‌కు ఛాంపియన్స్ లీగ్‌ని గెలవడంలో హెండర్సన్ ప్రముఖ పాత్ర పోషించాడు.