జోరూట్ స్టంపౌట్ అయ్యాడు.. చరిత్రకెక్కాడు
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ కొత్త చరిత్రను సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు, మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన అతను, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా పెవిలియానికి చేరాడు. అయితే తన టెస్టు కెరీర్‌లో రూట్ స్టంప్ అవుట్ కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఔటయ్యి కూడా జోరూట్ ఓ రికార్డును సాధించాడు. జోరూట్ ఇప్పటివరకూ 130 టెస్టు మ్యాచులాడి 11168 పరుగులు చేశాడు. అయితే తొలిసారి స్టంప్ ఔట్ అయి రెండో స్థానంలో నిలిచాడు.
స్టంపౌట్ కానీ ఆటగాడిగా మహేల జయవర్దేనే రికార్డు
విండిస్ మాజీ దిగ్గజం చందర్ పాల్ 11,414 పరుగులు చేసిన తర్వాత తొలిసారి స్టంపౌట్ అయి మొదటి స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో గ్రేమీ స్మిత్ 8800 పరుగులు చేసిన తర్వాత, ఇక టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ 8195 పరుగులు, సచిన్ టెండుల్కర్ 7419 పరుగులు చేసిన తర్వాత స్టంపౌట్ అయి నాలుగు, ఐదు స్థానాల్లో నిలవడం విశేషం. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్ కానీ ఆటగాడిగా మహేల జయవర్దేనే రికార్డుకెక్కాడు. టెస్టులో 11814 పరుగులు చేసిన జయవర్దనే ఇంతవరకూ ఒక్కసారి కూడా స్టంపౌట్ కాలేదు.