WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో కడప జిల్లా విద్యార్థిని.. ఆనందంలో తల్లిదండ్రులు
కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని శ్రీ చరణి కి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 లో ఆడే అవకాశం వచ్చింది. ఈ మేరకు జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ. 55 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. శ్రీ చరణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, వీరపనేని మండలానికి చెందినది. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. శ్రీ చరణి సాధారణ కుటుంబానికి చెందింది.
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
ఆమె ఈ ఘనత సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025 సీజన్ కోసం బెంగుళూరులో జరిగిన మెగా వేలంలో మొత్తం 120 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 91 భారతీయులు, 29 విదేశీయులు, 3 అసోసియేట్ నేషన్స్‌కు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుచుకుంది. రెండవ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కైవసం చేసుకుంది.