
బ్యాట్ పట్టుకున్న కేన్ విలియమ్సన్..ఐపీఎల్ గాయం నుంచి కోలుకున్నట్లేనా?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో మిగతా లీగ్‌లకు, కివీస్ తరుపున అంతర్జాతీయ మ్యాచులకు దూరమయ్యాడు.
అదే విధంగా ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా అతను ఆడటం అనుమానంగా ఉంది. విలియమ్సన్ వన్డే వరల్డ్ కప్ న్యూజిలాండ్ తరుపున బరిలోకి దిగకపోతే ఆ జట్టుకు పెద్ద లోపమే.
ఇటీవలే మరో కివీస్ స్టార్ ఆటగాడు మైకేల్ బ్రేస్‌వెల్ కూడా గాయపడటంతో అతను వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు.
ఇలాంటి సమయంలో అభిమానులకు కేన్ విలియమ్సన్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఆరంభం నుంచే కేన్ విలియమ్సన్ వేగంగానే కోలుకుంటున్నాడు.
Details
కుమార్తెతో సరదాగా క్రికెట్ ఆడుతున్న కేన్ విలియమ్సన్
గాయం నుంచి కోలుకుంటున్న కేన్ విలియమ్సన్ తన కుమార్తెతో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఈ వీడియో చూసిన అభిమానులు గాయం తర్వాత కేన్ విలియమ్సన్ ఆడుతున్న తొలి మ్యాచ్ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఏదిఏమైనా విలియమ్సన్ వన్డే వరల్డ్ కప్ నాటికి పూర్తిగా కోలుకోవాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. అతను రికవరీపై కివీస్ క్రికెట్ బోర్డు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బ్యాట్ పట్టుకున్న కేన్ విలియమ్సన్
Kane Williamson playing cricket with his daughter.
— Johns. (@CricCrazyJohns) July 4, 2023
Cutest video in the internet. pic.twitter.com/9Akevg9KzE