
Kashvi Gautham: అన్ క్యాప్డ్ ప్లేయర్‌కు రూ. 2 కోట్లు.. అసలు కాశ్వీ గౌతమ్ ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో జరిగిన మినీ వేలంలో కాశ్వీ గౌతమ్ రికార్డ ధర పలికిన విషయం తెలిసిందే.
రూ.10లక్షల ధరతో వేలంలోకి వచ్చిన కాశ్వీ గౌతమ్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
దేశవాళి క్రికెట్ లో ఆమె చంఢీఘర్ కు ప్రాతినిధ్యం వహించింది. ఇక 2023లో అండర్-19 క్రికెట్‌లో కాశ్వి గౌతమ్ హ్యాట్రిక్ వికెట్లు తీసి సత్తా చాటింది.
అరుణాచల్ ప్రదేశ్, చంఢీగర్ మధ్య జరిగిన మ్యాచులో కాశ్వీ ఈ ఫీట్ సాధించింది.
ఈ మ్యాచులో ఆమె హ్యాట్రిక్‌తో సహా మొత్తం పది వికెట్లను పడగొట్టింది. బ్యాటింగ్‌లోనూ 49 పరుగులు చేసింది.
Details
భువనేశ్వర్ కుమార్ పై కాశ్వీ గౌతమ్ ప్రశంసలు
కష్వీ 14 సంవత్సరాల వయస్సులో క్రికెట్‌లో అడుగుపెట్టింది.
గతేడాది జూన్‌లో హాంగ్ కాంగ్ వేదికగా జరిగిన అండర్ 23 ఎమర్జింగ్ టోర్నీలో భారత విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
తాజాగా ఆమె తన బౌలింగ్ గురించి ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు.
బౌలింగ్‌లో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చే వ్యక్తి అని, అతనిలాగా బౌలింగ్ చేయాలన్నదే తన కోరిక అన్నారు.
భువి ప్రపంచ స్థాయి బౌలర్ అని అని ఆమె ఉమెన్ క్రిక్‌జోన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.