
Kl Rahul: అంతర్జాతీయ క్రికెట్‌కు కేఎల్ రాహుల్ వీడ్కోలు! సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చాలా కాలం తర్వాత మళ్లీ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
2024 ఐపీఎల్ సమయంలో గాయపడిన రాహుల్ కోలుకున్న తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ తరుపున ఆడాడు.
ఇక లంక సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చేందుకు నానా కష్టాలు పడుతున్నాడు.
ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్ గురించి సోషల్ మీడియాలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.
Details
అధికారిక ప్రకటన వెలువడలేదు
త్వరలో ఓ ప్రకటన చేయబోతున్నా అంటూ సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ ఓ పోస్టు చేశాడు. దీంతో అతడు ఆటకు వీడ్కోలు చెబుతున్నాడని ఓ యూజర్ పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.
చాలా ఆలోచించిన తర్వాత, ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. నా కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులు, సహచరులు అభిమానులకు కృతజ్ఞతలంటూ కేఎల్ రాహుల్ పేరు మీద మరో పోస్టు ఉంది.
నిజానికి ఇదంతా ఫేక్ అని, కేఎల్ తండ్రిగా కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నాడేమోనని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
రిటైర్మెంట్ ప్రకటనపై కేఎల్ రాహుల్ కానీ, బీసీసీఐ నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.