
KL Rahul: 'యే బిడ్డా.. ఇది నా అడ్డా!.. చిన్నస్వామిలో కేఎల్ రాహుల్ విధ్వంసం (వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ క్లాస్ ప్లేయర్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై కేఎల్ రాహుల్ 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆరంభంలో నెమ్మదిగా - అనంతరం సిక్సుల వర్షం
పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆరంభంలో సావధానంగా ఆడిన రాహుల్, తర్వాత వేగంగా మోమెంటమ్ అందుకుని భారీ షాట్లతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు.
164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ ప్రదర్శనకు గాను రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Details
కేఎల్ రాహుల్ మాస్ సెలబ్రేషన్స్
విజయాన్ని సిక్సర్‌తో ముగించిన రాహుల్, దాంతో పాటు భావోద్వేగంతో నిండిన సంబరాలు జరిపాడు.
'ఇది నా అడ్డా' అంటూ అభిమానుల వైపు సైగలు చేయడం, తన హోమ్ గ్రౌండ్‌లో ఎలా ఆడాలో తనకే బాగా తెలుసని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో ఆయన కొన్ని అసభ్య పదాలు కూడా ఉపయోగించాడని వీడియోల ద్వారా స్పష్టమవుతోంది.
Details
పటిదార్ క్యాచ్ మిస్.. నా అదృష్టం : రాహుల్
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్, '20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయడం వల్ల పిచ్ గురించి అంచనా వేసే అవకాశం వచ్చింది.
ఇది ట్రిక్కీ వికెట్ అయినప్పటికీ వన్ పేస్ వికెట్. టూపేస్ కాదు. దీంతో బౌలర్లపై ఎలా ఆడాలో నాకు క్లారిటీ వచ్చిందని తెలిపాడు.
అలాగే పటీదార్ క్యాచ్ వదిలేయడం నా అదృష్టం. అది కీలక మలుపు అయ్యింది. వికెట్ కీపింగ్ వల్ల ప్రతి బ్యాటర్ ఎలా ఆడాడో, ఎక్కడ ఫెయిలయ్యాడో గమనించగలిగానని వివరించాడు.
Details
అడ్డాగా హోమ్ గ్రౌండ్
ఇది నా హోమ్ గ్రౌండ్. ఇక్కడి పరిస్థితుల గురించి ఇతరుల కంటే నాకే ఎక్కువ అవగాహన ఉంది. ఇక్కడ ఆడటం నాకు ఎప్పుడూ సంతోషం కలిగిస్తుంది.
సిక్స్ కొట్టాలంటే ఎటు వైపు టార్గెట్ చేయాలో, ఏ బౌలర్‌ను ఎప్పుడు ఎటు తరహా షాట్లతో ఎదుర్కొనాలో నాకు బాగా తెలుసని రాహుల్ అన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా, లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే
Local boy. Big stage. Statement made.
— Star Sports (@StarSportsIndia) April 10, 2025
How good was Bengaluru's KL Rahul against RCB tonight?
Next up on #IPLonJioStar 👉 CSK 🆚 KKR | FRI 11 APR, 6:30 PM LIVE on SS 1, SS 1 Hindi & JioHotstar! pic.twitter.com/wus2jEwNGv