Virat Kohli: ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ అదరగొట్టే అవకాశం : గావస్కర్
ఆస్ట్రేలియా, భారత్ మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా 4-0తో విజయం సాధించి, ఇతర జట్ల ఫలితాలను పట్టించుకోకుండా నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలని భావిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచాడు. మూడు మ్యాచ్‌లలో అతను కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆసీస్‌పై కోహ్లీ ఎలా ఆడతాడో అన్న ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. కోహ్లీ ఆస్ట్రేలియాలో అద్భుతంగా ఆడతాడని భారత మాజీ బ్యాటర్ సునీల్ గావస్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
కోహ్లీ ఫామ్ లోకి వస్తాడు
న్యూజిలాండ్‌పై విఫలమైన కోహ్లీ, ఆసీస్ పర్యటనలో భారీగా పరుగులు సాధిస్తాడని పేర్కొన్నారు. గత ఆసీస్ పర్యటనలో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌటైంది. అయితే కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేశాడు, ఇది అతని మంచి ప్రదర్శన అని చెప్పారు. అడిలైడ్ మైదానం కోహ్లీకి బాగా తెలుసని, 2018-19 సీజన్‌లో కోహ్లీ పెర్త్ మైదానంలో అద్భుతమైన సెంచరీ సాధించారని చెప్పారు. కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులో కుదురుకుని శుభారంభం చేయగలిగితే, అతను భారీగా పరుగులు చేయడం ఖాయమన్నారు.